Friday, July 20, 2012

ఒకరిని పొగడాలంటే అదేమిటో నోరు పెగలదు


ఒక కవిత చదువుతాం...అది బాగా అనిపిస్తుంది! యెవరైన ఒకరోజు చక్కని డ్రెస్ వేసుకొస్తారు..చాలా బాగా అనిపిస్తుంది...ఒకరి కంఠం చాలా బాగా అనిపిస్తుంది...మాటాడుతున్నప్పుడు...బ్లాగుల్లో ఒకోసారి బ్రహ్మాండమైన భావజాలాన్ని వ్యక్త పరుస్తారు కొందరు...! ఇలాంటివన్ని యెదురైనప్పుడు మాటవరసకి ఓ సారైనా బాగుందండి అనాలని అనిపిస్తుంది.కాని యేదో శక్తి లోపలినుండి " హు... వాడినేమిటి
...అభినందించేది...మరీ నెత్తిమీది కొస్తయి కొమ్ములు వాడికి." అంటూ హెచ్చరిస్తుంది. అదే Evil Spirit అంటే..!


కొంతమందికి యెంతసేపు యెదుటి వారినుండి అభినందనలు పొందటమే తప్ప ఇవ్వడం అంటే మాచెడ్డ చిరాకు.మానవ జీవితం అనే యంత్రాన్ని smooth గా నడపడానికి ఉపయోగపడేది పరస్పర సుహ్రుద్భావమే. దీనివల్ల ఖర్చు అయ్యేది కూడ యేమి ఉండదు.


ఆందుకే ఇంగ్లిష్ వారు అంటారు "GIVE EVERYMAN HIS DUE" అని.





6 comments:

  1. నిజమే.
    అందుకే to break the ice,
    బాగుంది మీ భావజాలం.

    ReplyDelete
  2. అవునండీ మీరు చెప్పింది నిజమే! భలే ..షుగర్ కోటెడ్ పిల్ లాంటి వాస్తవం చెప్పారు.
    థాంక్ యూ వెరీ మచ్!!

    ReplyDelete
  3. ఈ సమస్య మావాళ్ళల్లో చాలా ఎక్కువ.

    ReplyDelete