Friday, August 17, 2012

డబ్బు తో యేముందండి...మనుషులు శాశ్వతం గానీ...! అబ్బే...వాడు వట్టి డబ్బు మనిషండీ....ఇలాంటి కబుర్లని లేచిన దగ్గర్నుండి...యెన్ని సార్లో వింటూఉంటాం గదా.


డబ్బు తో యేముందండి...మనుషులు శాశ్వతం గానీ...! అబ్బే...వాడు వట్టి డబ్బు మనిషండీ....ఇలాంటి కబుర్లని లేచిన దగ్గర్నుండి...యెన్ని సార్లో వింటూఉంటాం గదా...!పైకి మనుషులం అలా యేదో అనుకుంటూ ఉంటాం గానీ...అందరం ఇంచు మించు యేది చేసినా..యెన్ని నంగనాచి కబుర్లు చెప్పినా ఆ డబ్బు కోసమే కదూ..!కొన్ని లోపల బాగా అర్థం అవుతూనే ఉంటాయి..కాని నటన తప్పని పరిస్థితి..!

డబ్బు లేకుండా యే పని అయినా అవుతుందా...కనీస అవసరాల దగ్గరనుంచి...ఒకమాదిరిగా జీవించాలన్నా తప్పనిసరిగా యేది చేసైనా సంపాదించి తీరాలిసిందే..!మన మంచి తనం చూసో...జాలి పడో యెవరూ యెవరికీ చెయ్యి విదల్చరు...అది చేదు వాస్తవం...ఇంకొకరితో పోల్చుకోవడం మొదలు పెట్టినప్పుడు ...డబ్బు సంపాదించాలనే కసి మరింత పెరుగుతుంది...దాని కోసం యెన్ని అడ్డదార్లు తొక్కడానికైనా చాలమంది వెనుదీయరు.

నా ద్రుష్టిలో డబ్బు సంపాదనకి చదువుకి సంబంధం లేదు.మీరు యే గ్రామమైనా వెళ్లండి...లేదా నగరాల్లో నైనా చూడండి..చదువుకున్న వాళ్లకంటే చదువు తక్కువ ఉన్న వాళ్లే సంపాదించే విషయాల్లో ముందంజలో ఉంటారు.రాజకీయాల్లో నైతే పెట్టుబడి లేని సంపాదన...వందల వేలకోట్లే..! ప్రభుత్వ ఉద్యొగి 1000 రూపాయలు లంచం తీసుకుంటే..గగ్గోలెత్తే జనాలు...ఇలాంటి జంబొ సంపాదనా పరుల జోలికి పోరు...!!!పోతే యేమవుతుందో వారికి బాగా తెలుసు...!!!

అసలు డబ్బు అనే concept దేవుడనేవాడు ఈ మనుషులమధ్యన  యెందుకు పెట్టాడూ.. అని ఆలోచిస్తే నాకు తోచింది ఒకటే..! అసలు డబ్బు కోసం వెంపర్లాడే క్రమంలోనే మనిషిలో అనేక అంతర్ముఖమైన windows తెరుచుకుంటాయి. తోటి మనిషి యొక్క లోపలి పొరలు అర్థం అవుతాయి.పై పై ని ప్రేమల బోలుతనం అర్థం అవుతుంది.అసలు నిజంగా డబ్బు యొక్క విలువ కూడా అనుభవాత్మకంగా అర్థం అవుతుంది...డబ్బు యెన్ని పనులు చేయ గలుగుతుందో..బోధపడుతుంది.యెదుటి మనిషి చేసే సహయం యొకా విలువ కూడా తెలుస్తుంది.మానవుడు పొందిన ప్రతి అభివ్రుద్ది వెనుక ధనం యొక్క చోదనా శక్తి ఉంది.డబ్బు సంపాదించడం ఒక యెత్తు అయితే దాన్ని సమ్యమనం తో నిలబెట్టుకోవడం ఒక యెత్తు. 

There is no virtue in poverty.
                                          .........Samuel Johnson
  

1 comment:

  1. జీవితంలో డబ్బు కొంతవరకు అవసరమేనండి. అయితే, చాలా సమస్యలను డబ్బు పరిష్కరించలేదు.

    బస్సు, రైలు , విమానం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు డబ్బు కన్నా , వారు ఆచరించిన ధర్మమే వారిని రక్షిస్తుంది.

    ఒకే ప్రమాదంలో కొందరు క్షేమంగా ఉంటారు. కొందరు మరణిస్తారు కదా !. ఇదంతా వారివారి పూర్వకర్మఫలితాలను బట్టి ఉంటుందనిపిస్తుంది.

    ఎంత డబ్బున్నా, సమయానికి అవసరమైన రక్తం దొరకక పోతే ఆ పేషెంట్ ప్రాణం నిలవదు.

    డబ్బుతో కొనలేనివి జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి.

    ReplyDelete