మనం తెలుగు మీద ప్రేమ యెక్కువ అయ్యినప్పుడల్లా సంస్క్రుత పదాల్ని తెలుగు లో కలుపుకొని మాట్లాడుతూ అదే పరమ వీర తెలుగు అని భ్రమ పడుతుంటాం.ధూమ శకట వాహనం,రహదారి,రక్తం,జలం ఇలాంటి పదాలు యెవరైనా వాడినప్పుడు ఆహా యెంత చక్కని తెలుగు మాట్లాడుతున్నాడో అని అనుకొంటుంటాం.నిజానికి అలాంటి పదాలన్ని అచ్చ తెలుగు పదాలు కావు.సంస్క్రుత భాషలోనుండి అరువు తెచ్చుకున్నవే...కేవలం ఇవనే కాదు తెలుగు యమ భక్తి తో మాట్లాడుతున్నాము ...రాస్తున్నాం అనుకునే వాళ్లంతా సంస్క్రుత భాషలోని సమాసాల్నే నోరు తిరగకుండా వాడుతూ ...సామన్య జనాల్ని గొప్ప తెలుగు భక్తులం అని బురిడికొట్టిస్తుంటారు.
నెత్తురు,పొద్దు,కూతురు ఇలాంటి పదల్ని యెవరైనా ఉపయోగిస్తే వారిని తెలుగు రాని వారిగా జమ కడతం.sanskrit తో కలిసిన తెలుగు ని ఉపయోగించడం నన్నయ్య దగ్గర్నుంచి ఒక ఒక sophisticated పద్దతిగా తయారై అసలైన తెలుగు పదాల్ని తుంగలో తొక్కుకున్నాం.ఈ దుస్తితి తమిళ భాషలో చాలా చాలా తక్కువ.
No comments:
Post a Comment