సోమవారం సాన్వి అనే పాప కిడ్నాప్ అవడం,ఆ పాప బామ్మ దుర్మరణం చెందడం అమెరికా లోని తెలుగు వారితో పాటు మన డేశం లోని వారికి కూడా చాలా బాధ కలిగించిన విషయం.ప్రస్తుతం ఆ పాప కుటుంబం king of prussia ఏరియా లోకి ఈ జూలై లోనే వచ్చినట్టు తెలుస్తోంది.గత అయిదు సంవత్సరాలనుంచి అమెరికా లో ఉన్నప్పటికి...!పోలీసులు amber alert కూడ అదే రోజు ఇచ్చారు...అయినా ఈ నాటికి క్లూ దొరకక పోవడం ఆశ్చర్యం గా ఉంది.ఇంతా చేసీ ఆ 60 యేళ్ళు దాటిన వ్రుద్దురాలు ఏ ఆయుధం వల్ల చంపబడిందో ఇంతవరకు post mortem report బయటికి రాలేదు.F,B.I. లోని K-9 రంగం లోకి దిగిందంటున్నారు.ఓ వైపు తానా లంటి వాళ్ళు స్థానిక అటార్నీ తో కలసి reward ని ప్రకటించారు.
నేను గతం లో ఒక పోస్ట్ పెట్టాను.ఈ మధ్య కాలం లో ఎందుకని భారతీయులు పశ్చిమ దేశాల్లో అర్ధాంతరంగా అసువులుబాస్తున్నారు అనే విషయంలో...సరే.....నిజా నిజాలు ఆ పై వాడికే తెలియాలి...!
No comments:
Post a Comment