శివపూజకు చిగురించిన...అనే గీతం తో ప్రారంభమైంది.ఘల్లు ఘల్లున ..పాట శిల్ప బాగానే పాడినట్లనిపించింది..కొంత తెలుగేతర యాస తప్పదుగా.. తినగతినగ వేము తియ్యనైనట్లు వినగా వినగా వీళ్ళ యాస కూడ ఒక అందం గానే తోస్తున్నది. నీ అందాల చేతులు...పాట పాడిన మీనన్ గొంతు కొద్దిగా పి.బి.మాదిరిగా నే ఉన్నది.ప్రతి మళయాళి గొంతు లో ఒక వైబ్రేషన్ (వణికినట్టుగా) ఉంటుంది..అది ఆ భాష స్వభావం వల్ల వస్తుందనుకుంటాను.
కోపమా నాపైనా...ఓ.కె.!గోదారి గట్టుంది..పరవాలేదు.నైరే నైరే ..పాట బాగానే పాడాడు.గెస్ట్ గా వచ్చిన వడ్డేపల్లి కృష్ణ మంచి లలిత గీతాలే రాసినట్లు గుర్తు.అప్పట్లో రేడియోలో వినేవాణ్ణి.ఇండియా నుణి వెళ్ళి సహకరిస్తున్న గాయణీమణులు బాగా తమ స్వరం తో సహకరిస్తున్నారు. ఇక బాలు గురించి చెబితే మరీ పొగిడినట్లుగా వుంటుంది. Click here for more
No comments:
Post a Comment