Tuesday, October 22, 2013

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగు ముక్కలు



ఈ గంగ కెంత దిగులు...వంటి వినసొంపైన పాటతో కార్యక్రమం ప్రారంభించడం ముదావహం.serenity నికళ్ళకికట్టినట్టు చూపించే మధుర గీతమది.పెండ్యాల,దేవులపల్లి ధన్యులు.మిల మిల మెరిసే.. అనే శిల్ప పాట గూర్చి ఏమి చెప్పాలి..? అసలు ఒరిజినల్ పాటే నాకర్ధం కాదు.నన్నడిగితే ఇంగ్లీష్ పాటలు ఇంగ్లీష్ లోనే వినాలి..వాటిని వేరే భాషల్లోకి దింపితే యమ కృతకంగా ఉంటుంది.ఏదైనా ఒకటీ అరా ..మెలోడి అప్పుడప్పుడైతే ఓ.కె.!

రారా చెంతకు రారా..అనే పాట తెలుగు లో ఎంత హిట్ అయిందో..తమిళ్ లో అంత హిట్ అయింది.మంచి ట్యూన్ కి మంచి సంధర్భం తోడైతే అదెప్పుడూ జనాల్లో అలా ఉండిపోతుంది.ఈ అమ్మాయి అంత కష్టమైన పాటని ఎన్నుకోవడం దుస్సాహసమే..దాంట్లో సంగతులు పలకడం అటుంచి ..ఉచ్చారణ పరంగా కూడా ఎబ్బెట్టుగా ఉన్నది.ఎలాంటి electrifying spirit నిండి ఉన్న గీతమది..? 

గాజువాకపిల్ల..వేణుమాధవ్ బాగానే పాడాడు.బొమ్మాళి...హ్మ్మ్ ఓ.కె.! రమ్య శిష్టల నిష్క్రమించింది.సరే ఇవాటికి ఉంటాను. Click here

No comments:

Post a Comment