ఓ పాపాలాలి...అనే గీతాంజలి సినిమాలోని గీతం తో ప్రారంభమైంది.బాలు గళ మాధుర్యం వెన్నెలలో కూర్చొని పంచదార వేసిన పాలబువ్వ తిన్నంత హాయిగా ఉంటుంది. ఈ సారి అన్నీ ఇళయరాజా స్వరపరచిన పాటలే పాడారు.
పరువమా చిలిపి పరుగు తీయకు....అనే మౌన గీతం లోని ఆ పాట ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.పొద్దున్నే జాగింగ్ చేసే సమయం లో అలా ఓ పాట పెట్టాలని అనుకోవడం విన్నూత్నమైన యోచన.దానికి తగ్గట్లు వెనుక బూట్ల చప్పుడుతో ...మంద్రమైన చిరుగాలి వీస్తున్నట్లుగా ఆ పాట.ఎంత హాయిగా వుంటుదో విజువల్స్ లో..!సింగర్ న్యాయం చేశాడు.
రాముడు అనుకోలేదు...అనే రాజ్ కుమార్ లోని ఆ పాట పాడిన అమ్మాయికి ఇంకా కొంత ఎనర్జీ కావాలి గొంతులో..!అయితే స్వరం బాగున్నది.సాహసం నా పధం ....అనే మహర్షి లోని పాట పాడిన సింగర్ ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం వుంది.కరిగిపోయాను కర్పూర వీణ లా ...ఆ అమ్మాయి వాయిస్ విలక్షణంగా వున్నది.
చుక్కల్లే కాచావే...అనే పాట బాగా పాడాడు.కలకాలం నిలిచే పాట అది.ఈ పోస్టులు రాస్తున్నప్పుడు ఈ కార్యక్రమానికి సబందించి లింక్ ఇద్దామని ఆలోచన వచ్చింది.పిచ్చిగాని నిజమైన పాటల మోజుగాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమం చూడకుండా ఉంటారా..? ఎలాఉంటుందంటే అది ఆవు బొమ్మ వేసి కింద ఆవు అని రాసినట్టు వుంటుంది.కనక విరమించుకుంటున్నా ఆ ప్రతిపాదనని. I don't give any damn for that . Click Here
No comments:
Post a Comment