Tuesday, November 26, 2013

నిన్నటి పాడుతా తీయగా పై నాలుగు ముక్కలు



సిరిమల్లె నీవె..అనే మధురమైన గీతం తో మొదలైనది.పంతులమ్మ లోని అన్ని పాటలు దేనికవే బాగుంటాయి.దేన్ని తీయజాలం.రాజన్-నాగేంద్ర ద్వయం సంగీతం లో వచ్చిన చాలా సినిమాల్లోని పాటలు మదురాతి మధురంగా,చాలా బాగుంటాయి.

ఓహో లైలా (చైతన్య) ...పాట పరవాలేదు.నేను ఎక్కువగా వాళ్ళ పాడిన విధానం లోని గుణదోషాలను ఎంచను. ఎందుకంటే దానికి సంబందించి బాలు చెప్పిందానికంటే నేనేమి చెప్పను.ఒక్కమగాడు ...పాట పాడిన అమ్మాయి గొంతు హస్కీ గా ఉన్నది.కొన్ని ఇంగ్లీష్ పాటలకి బాగా ఉంటుంది...ఏదైనా రాక్ బేండ్ లో సక్సెస్ కావచ్చును.

అంజలి...పాట well tried by Ananta. తకధిమి తోం...మీనన్ ఓకె అనిపించాడు.సంకురాత్రి ...పాట బిందు న్యాయం చేసింది.నే వస్తానంటే..పాట,హలో గురూ ..బాగా పాడారు.పోను పోను వీళ్ళందరు మంచి పాటగాళ్ళు గా పరిణమించుతున్నారు.సంతోషం.ఒక్క పాట మాత్రం మిస్ అయ్యాను..అనివార్య కారణం వలన..!Click here

No comments:

Post a Comment