Saturday, April 6, 2019

ఓట్ల పండగ వచ్చింది మళ్ళీ...


ఓట్ల పండగ వచ్చింది మళ్ళీ...! (కవిత) ---మూర్తి కె.వి.వి.ఎస్. 

ఓట్ల పండగ వచ్చింది మళ్ళీ...

అసలు ఓటు వేయాలంటేనే చికాకు పుడుతోంది మళ్ళీ మళ్ళీ..!

ఎవరొస్తే ఏమిటి...ఎవరి దోపిడీ వారిదే..!

ఏ కాస్త కింద పడినా నోటినుంచి, దాన్ని కళ్ళకి హత్తుకుని 

స్వాహా చేసేవారు ఇంకొందరు..!

ప్రతి రాజకీయుడు నోరు విప్పితే నీతుల పుట్టే..!

కళ్ళు విప్పి గమనిస్తే తెలుస్తుంది ..! దేశ విదేశాల్లో వారి ఆస్తుల చిట్టా !

పేరు కే ప్రజాస్వామ్యం..అన్నీ రాచరిక పోకడలే..!

కుటుంబ పాలనలు,కుల పాలనలే..!

ప్రభుత్వ ఆఫీసు లో క్లర్కు వై వంద నో,వెయ్యి నో నొక్కావో 

నిన్ను ఏ.సి.బి. నో సి.బి.ఐ నో లోనికి తోస్తుంది..!

అదే ఎంచక్కా వందల,వేల కోట్లలో ప్రభుత్వ సొమ్ము నొక్కెయ్ లేదా 

బ్యాంక్ ల్ని లూటీ చేసేయ్..!చక్కగా ఓ ప్రిస్టేజ్ ఏడుస్తుంది ఇక్కడ..!నువు పోయిన తర్వాత ఆ ఎంక్వెరీలు 

ఎప్పుడో బయటకి వస్తాయ్,మన ప్రజలు ఉదార హృదయులు ,నీ వాళ్ళకీ ఏం కాదు బెంగిల్లకా..! 


చదివిన వాడూ అంతే,తెలిసిన వాడూ అంతే..!

నలుగురి తో నారాయణ,ఈ దారి లోనే కలదు మరి 

చట్టబద్ధ దోపిడి కి దగ్గరి తోవ..!

విచిత్రం గా ప్రజలూ అంతే...వాళ్ళ ప్రభుత్వం గా 

వాళ్ళు దోచుకోవడం సహజమని సన్నాయి నొక్కులు..!

ఏ ఒక్క వర్గమో,కులమో ఓటు వేస్తేనే ప్రభుత దిశ గా వీరు వెళ్ళారా..!

ఏమిటీ బానిస తనం..ఔను మరి ఎన్నివేల చరిత మనది దానిలో..!

ఇదంతా ఎందుకు గాని ..ఒక్కసారి అధికారం లోకి వచ్చిన కులం 

మళ్ళీ మరో సారి రాకుండా చేయండి చూద్దాం..!

మన దేశం లో వాటికి లోటు ఏముంది గనక...అప్పుడు అందరకీ అందుతుది ఎంతోకొంత వాటా ..!

1 comment:

  1. బాగా చెప్పారు.నీతిని చెప్పవలసిన బడిపంతుళ్ళూ కులరాజకీయాలను సపోర్ట్ చేస్తూ ఉంటే రాజనాలలాంటి వాళ్ళు భలే చెప్పారు మాష్టారూ అంటూ చిడతలు వాయిస్తున్నారు.

    ReplyDelete