Tuesday, July 17, 2012

ప్రియుడితో కలిసి భర్తని చంపుతున్న భార్యలు...!!!


ఈ మధ్య యే పేపర్ చూసినా ఒక  News బాగా వస్తోంది...గమనిస్తున్నారా..! ప్రియుడుతో కలిసి భర్తని హతమార్చిన భార్య అని...లేదా ప్రియురాలి కోసం భార్యని చంపిన భర్త అని...!! Market econamy లో భాగంగా అడుగుపెడుతున్న పరిణామాలివి.
యెవరూ యెవరిని సహించే పరిస్థితి లేదు. నువ్వెంతా అంటే నువ్వెంత ...అలా ఉంది వాతావరణం.


Spouse పట్ల ఇష్టం లేకపోతే ,కలిసి ఉండే పరిస్థితి లేకపోతె చక్కగా Divorce ఇచ్చుకోవాలి. లేద యెవరి బ్రతుకు వాళ్లు బ్రతకాలి. కాని ప్రాణాలు తీసుకునేదాకా ఎందుకు...??? జీవితం చాలా విలువైనది...యెవరికి ప్రాణాన్ని హరించే హక్కు లేదు. ఇవాళ రేపు ఆడ మగా  అందరు చదువుకుంటున్నారు...యెంతోకొంత సంపాదించుకుంటున్నారు.


మారుతున్న కాలాన్ని బట్టి యెన్నో మార్పులు మన జీవనంలో చోటుచేసుకోవడం సహజం.మార్పుని అనేక రంగాల్లో ఇష్టం ఉన్న లేకపోయిన అహ్వానించి తీరాలిసిందే..  ఆధునిక జీవనం తెచ్చె మార్పులు సౌకర్యాలు మనం కోరుకునేటప్పుడు దానికి ఇంకో వైపు ఉండే జీవితాన్ని కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి.



No comments:

Post a Comment