Monday, July 16, 2012

జెనీలియా డిసౌజ,ఇలియాన డిసిల్వా.....వీళ్లంతా యెవరో తెలుసా...?


జెనీలియా డిసౌజా, ఇలియానా డిసిల్వా ఇలాంటి పేర్లు విన్నప్పుడల్లా యేదో Christian names అని అనుకుంటుంటాం గాని మనసు పెట్టి ఆలోచిస్తే వాటి వెనుక చాలా చరిత్ర ఉంది.డిసౌజ,డిసిల్వా,రోడ్రిగ్స్,ఫెర్నాండో ఈ Surnames అన్ని Portuguese వారికి చెందినవి.ఇంగ్లిష్ వాళ్ల లా వీళ్లు Europe నుంచి వచ్చిన వారే...!అసలు వాళ్లకంటే వీళ్లే మనదేశానికి ముందు వచ్చారు.


1515 ప్రాంతంలో Goa కి Afonso de Albuquerque అనే ఆయన గవర్నర్ గా వచ్చాడు.Portuguese  సైనికులని స్థానిక
 భారతీయ యువతుల్ని వివాహం చెసుకోవాలిసిందిగా ఆయన ప్రోత్సహించేవాడు. అలా Native Indians ని పెళ్లి చేసుకున్న వారికి అదనపు  Increments ఇవ్వడం జరిగేది.


దీనివెనుక వాళ్లకి ఉన్న కారణాలు వాళ్లకి ఉండవచ్చును.ఐయితే ఒక కొత్త జాతి దీని మూలంగా యేర్పడింది.భారతీయుల రూపంలో ఉన్న portuguese వారు అవతరించారు.అంతే గాక  Roman Catholics గా అనేక మంది క్రైస్తవ మతంలోనికి మార్చబడ్డారు.


బ్రాహ్మణుల దగ్గరనుండి క్రిందికులాల వరకు ఇలా మార్చబడిన వాళ్లలో ఉన్నారు. అంతదాకా యెందుకు..కొంకణస్త బ్రాహ్మణులనేవారు మలబారు నుండి గోవా వరకు పశ్చిమ తీరంలో ఉంటారు.వీరు Europe నుండి వచ్చిన ఒక తెగగా పరిశోధకులు చెబుతున్నారు.వీరి కళ్లు 
Gray and blue రంగులో ఉంటాయి.


హూణులు,యవనులు  (Greeks),సిధియన్లు వంటి విదేశీయులు ఉత్తరాది లో Jats మరియు రాజపుత్రుల్లో విలీనమయ్యారు.


ఇలా దేశ,కాల పరిస్తితులని బట్టి జరుగుతుండడం యెక్కడైనా సహజమే...!


     
         



No comments:

Post a Comment