Saturday, July 28, 2012

భీం సేన్ జోషి గారు నాకు వాళ్ల ఇంట్లో టీ ఇచ్చి మరీ మాట్లాడడం ఇప్పటికీ ఒక అద్భుతమైన విషయమే...!


దాదాపుగా పదహారేళ్ల సంగతి ఇది.మా మిత్రుడు ఒకరు పూనా లోని Ferguson college లో చదువుతూన్నప్పుడు నేను maharashtra చూడడానికి వెళ్లాను.అప్పటికే అతను చాలా రోజుల నుండి నన్ను ఆహ్వానిస్తున్నాడు.సరే...మనకీ ప్రయాణాలంటే ఇష్టమే కదా..!వెళ్లాను. మధుదండావతే ఇంకా వి.పి. సింగ్ ఇట్లాంటి యెందరో ప్రముఖులు చదువుకున్న పురాతన కళాశాల అది. చాలా దేశాల నుంచి వచ్చి చదువుకుంటున్న విధ్యార్థులు ఉన్నారక్కడ.తెల్ల వారుజామున ఒక Thailand దేశస్తునితో కలిసి జాగింగ్ చేసాం.అతడిని మా మిత్రుడు Pratap పరిచయం చేసాడు.మా రూం కి ప్రక్కనే అస్సాం విద్యార్థులు ఉన్నారు. ఒక మిని దేశం లా ఉంది. పెరియ సామి అనే ఒక Tamilian మా రూం కి వచ్చి చాలా సేపు మాట్లాడాడు. అదే college లో lecturer అవ్వాలని అతని కోరిక.యెందుకు...maharastra వాళ్లు నీకు ఉద్యోగం దొరకనిస్తారా అంటే...అబ్బే...మరాఠా వాళ్లకి ఉద్యొగం కంటే యేదైనా వ్యాపారం లోకి వెళ్లడమే ఇస్టం అన్నాడు.


ఆ తరవాతి రోజు పూనా కి యెలాగు వచ్చాం కదా.. ప్రఖ్యాత హిందుస్తాని గాయకుడు భీం సేన్ జోషీ గార్ని కలుద్దామని వాళ్ల ఇంటికి వెళ్లాం.యేదో పెద్ద పూర్వ జన్మ నుంచి పరిచయం ఉన్న వాళ్ల లాగ వెళ్లి వెళ్లగానే ఆ ఇంటి calling bell  నొక్కాం. ఆ తలుపు కాసేపు ఆగి తెరుచుకుంది. సాక్షాత్తు ఆ తెరిచింది యెవరనుకున్నారు...భీం సేన్ జోషిగారే..! ఆంధ్ర ప్రదేష్ నుంచి వచ్చామని.. చెప్పాం. రమ్మని లోపలికి పిలిచి సోఫా లో కూర్చోబెట్టి మా ప్రక్కనే కూర్చున్నారు.మంగళంపల్లి తనకి మంచి స్నేహితుడని,సినీ సంగీత దర్షకుడు G.k.venkatesh తన క్లాస్ మేట్ అని చెప్పారు. మాకు టీ కూడా ఇచ్చారు.యెవరో ఒక ఇంట్లో మనిషి లాగానే చాల సేపు పిచ్చాపాటి గా మాట్లాడాము. ఇంతలోనే బహుషా వాళ్ల అమ్మాయి అనుకుంటాను... ఆయన్ని లోపలికి పిలవడంతో వెళ్లారు. కాసేపున్నతరవాత ఆయనే బయటికి వచ్చి నాకు సెలవు ఇవ్వవలిసిందిగా కోరారు.


ఆయన మాకు అప్పటికి " సుర్ మిలే బనే హమారా" అనే పాట పాడిన గాయకుడిగానే తెలుసు తప్ప ఆయన భారతీయ సంగీత జగత్తులో మేరు నగ ధీరుడని,Jawaharlal nehru  లాంటి వారికి అభిమాన గాయకుడని ఆ తర్వాత తెలుసుకుని చాలా నాళ్లు నిద్ర పట్టలేదు. అటువంటి మహానుభావుడి ప్రక్కన కూర్చుని సొంత స్నేహితుని వలే మాట్లాడామా..యే జన్మలో చేసుకున్న అద్రుష్టమో ఇది..! వయసు లోను,ప్రతిభ లోను యెంతో మాకంటే పెద్ద వారైనా మా పట్ల ఆయన చూపిన ఆదరణ నాకు ఇప్పటి కి ఒక కల లాగానే ఉంది.. Great souls are always simple..! అని అందుకే అన్నారేమో..!     
  

No comments:

Post a Comment