Tuesday, July 24, 2012

కేరళ రాష్ట్రంలో నాకు నచ్చిన కొన్ని అంశాలు


కేరళ రాష్ట్రానికి Train లో (కోర్బా ఎక్స్ ప్రెస్) వెళుతున్నప్పుడు ఆ state బోర్డర్ రాగానే పుస్తకాలు పట్టుకుని బిల బిల మంటూ vendors లోపలికి రావడం వింతగా అనిపించింది.ఇది దాదాపుగా నేను నాలుగేళ్ల క్రితం ఆ రాష్ట్రం వెళ్లినప్పటి సంగతి.మళయాళ,ఇంగ్లిష్ పుస్తకాలు బాగా అమ్ముడు అవుతాయి రైళ్లలో.వాళ్ల పుస్తకాలు కొని చదివే సంస్క్రుతి మంచిగా అనిపించింది.


కొట్టాయం నగరమే అయినప్పటికి యెటు చూసినా విపరీతమైన పచ్చదనం.simplicity,cleanliness వారి జీవనంలో ఒక భాగం.ఇళ్లు నిర్మాణం లో వాళ్లదొక ప్రత్యేక శైలి. tiles బాగా వాడతారు.కొబ్బరి చెట్లు,రబ్బర్ చెట్లు యెటు చూసినా నిండుగా ఉంటాయి.నా ద్రుస్టిలో కేరళ అంతా పేద్ద పచ్చని పార్కు లాగా ఉంటుంది. back waters ఆ రాష్ట్ర సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంటాయి.


మళయాళీల కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి. అందంగా కూడా ఉంటారు. అలనాటి k.r.vijaya  దగ్గర్నుండి నేటి aasin దాకా యెందుకు యెక్కువగా నటీమణులు ఆ రాష్ట్రం నుండి వస్తుంటారో అప్పుడు అర్థమైంది.స్త్రీల లో independent nature యెక్కువ అనిపించింది. ఒకప్పుడు అక్కడ మాత్రుస్వామ్యం ఉండడం కూడా ఒక కారణం కావచ్చు.



   

No comments:

Post a Comment