Saturday, August 11, 2012

మనవాళ్లని America లో యెందుకు పిచ్చికుక్కల్లా చంపుతున్నారు...?


అయిదుగురు తెలుగు వాళ్లు ఒక్లహామా లో ఓచోట కారు ప్రమాదం లో మరణించారు.ఇది ఈరోజు పేపర్లలో వార్త.జనాలు కూడా సీరియెస్ గా తీసుకోవడం మానేసారేమో ఇలాంటి వార్తల్ని అనిపిస్తుంది చూస్తుంటే.ఇంచు మించు ప్రతి నెలలో australia,U.S.A.,U.K., ఇలాంటి దేశాల్లో యేదో ఓచోట తెలుగు లేదా భారతీయ యువతరం చంపబడటమో ,దెబ్బలు తినడమో లాంటివి  జరుగుతూనే ఉన్నాయి.  మన వాళ్లు కంటి తుడుపు ప్రకటనలు చేయడం తప్ప ప్రభుత్వ పరంగా చెయ గలిగేది యేముంది..?ఆ దేశాల్ని గట్టిగా యెదుర్కునే దమ్ము భారత్ కి ఇంకొక 1000 సంవత్సరాలకి కూడ లేదు.

మీరు బాగా గమనిస్తే తెలిసేదేమంటే యెవరి సేవలైతే వివిధ రంగాల్లో వారికి అవసరమో ,నిజమైన మేధొ శక్తి తో వారికి సాయం చేయగలరో అలాంటి భారతీయుల్ని వాళ్లు చంపుతున్నట్టుగా అనిపించడం లేదు. యెందుకో ఇవన్ని అక్కడి Govts ప్రణళికా బద్ధంగా చేస్తున్నవే ననిపిస్తుంది.కాకపోతే ఒకోసారి ఒకోరకమైన modes operandi అన్న మాట. మొన్నటికి మొన్న గురుద్వార పైన దాడి..కొంతమందిని చంపడం..!

దీంట్లో మన వైపు తప్పు లేదా అంటే...లేకపోలేదు...ఇప్పటి వాళ్లలో  అమెరికా లాంటి దేశాలకి  వెళ్లే వాళ్లు  ముఖ్యంగా త్వరగా డాలర్లు సంపాదించాలనే యేవ యె తప్ప గొప్ప పరిశోధనలు చేసి ఆ యా సమాజాలకి help చేయగలిగే వాళ్లు కాదు.యే దేశమైన ఒక స్థాయి దాకానే విదెశీ exodus ని అనుమతించగలదు.లేక పోతే దాని పరిణమాలు యేమిటో వారికి బాగా తెలుసు.మనకంటే కొన్ని వందల సంవత్సరాలు ముందు కళ్లు తెరిచి ప్రపంచాన్ని పాలించిన జాతులు వారు అని గుర్తుంచు కోవాలి.

మన దగ్గరే మంచి భూ వసతి, డబ్బులు గట్రా ఉండి చక్కగ జీవించె అవకాశం ఉన్నప్పటికీ false prestige కోసం America కి వెళ్లే వాళ్లు నాకు చాలా మంది తెలుసు. వీళ్లందర్ని భరించడానికి విదేశాలికి యెమిటంత అవసరం...?

మానవ హక్కులు మంట కలుపుతున్నారని మనం అరిచే అరుపులు పట్టించు కొనేవాళ్లు యెవరున్నారని..?అలాంటి  పడి కట్టు పదాలు విని వాళ్లు లోపలే నవ్వుకున్న  అశ్చర్యం లేదు.

యెందుకంటే ప్రపంచ దేశాల affairs లో  కలగచేసుకోవడానికి వాళ్లు పుట్టించిన సాంకేతిక పదజాలం అది.  

మన వాళ్ల లోనున్న బలహీనత యేమిటంటే ఒక విష్యం నిజమని తెలిసినప్పటికి దాన్ని ఒప్పుకోరు సరికదా కేవలం argument కోసమే వాదిస్తూ కాలయాపన చేస్తుంటారు.అందుకే prctical plane లో మనం యెప్పుడూ వెనకబడి పోతుంటాం..

మానసిక ,భావాత్మక రంగాల్లో  America లేదా Europe ప్రజల  స్థాయి యెలా ఉంటుందో ఇక్కడి వాళ్లకి చెప్పినా అర్ధం చేసు కోలేరు.. అందుకే అమెరికా అనుభవాలు చెప్పమని యెవరినైన అడిగి తే అక్కడి DISNY LAND లాంటి వాటి గూర్చి చెబుతారు..at the same time they know the big brother is always watching with thousand eyes.   

































No comments:

Post a Comment