శ్రీ రామక్రిష్ణ పరమ హంస వంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఒక్క భారత దేశం లోనే పుడతారేమో నని నా ప్రగాఢ విశ్వాసం...! ఆయన తత్త్వాన్ని యెక్కువగా చెప్పే శక్తి నాకు లేదు గాని వివేకానంద స్వామి వంటి వారి రచనలు (My Master and through his other talks ) చదివినప్పుడు అనేక వందల యేళ్ల నుంచి భారత ఆధ్యాత్మిక మహా దిగ్గజాలు యేమైతే చెప్పదలుచుకున్నారో అవన్ని తన మాటల ద్వారా మాత్రమే గాక తన దైనందిన జీవితం లో ఆచరించి చూపించి తన జీవితమే ఒక ఉద్గ్రంధం గా తన శిష్యులకి ఇచ్చారు.
ఈ రోజు వారు సమాధి చెందిన రోజు గా ఈ కొన్ని మాటలు..అంతే..! christianity ని islam ని తాను స్వయంగా పాటించి ఆ మార్గాలు కూడ అందరు అనుకునే పరమాత్మ దగ్గరకే చేర్చుతాయని నిరూపించారు. ఆ మతాల్ని అనుసరించినప్పుడు నూరు శాతం ఆ మతస్తుని గానే మారి పోయేవారు. తంత్రం ,అద్వైతం ,ఇంకా వివిధ మార్గాల్ని అనుష్టించి ప్రతి ఆధ్యాత్మిక మార్గం చివరికి అందరిని ఒకే దగ్గరకి చేర్చుతుందని చెప్పారు.
నేను యెన్నో యేళ్ల నుంచి దేవుణ్ని పూజిస్తున్నా...నాకెందుకు ఆయన కనిపించడు అని ఒకరు అడిగి నప్పుడు శ్రి రామక్రిష్ణులవారు ఇలా అంటారు.నీవు నీ భార్య కోసమో,ధనం కోసమో,పుత్రుని కోసమో విపరీతంగా విలపిస్తావు....ఆ విధంగా యెప్పుడైన నువ్వు భగవంతుని గుర్చి పరితాపం చెందావా... ఆ విధంగా నీ పూర్ణ శక్తి తో విలపించితె తప్పక ఈ రోజే కనిపిస్తాడు ' అంటారు.
ఆయన లో మనకి కనిపించే మరో విశెషం యేమిటంటే ఆయన చెప్పిన సాద్రుశ్యాలన్ని ఒక సామాన్య వ్యక్తి కి పండితునికి ఒకేలా అర్థం అవుతాయి.ఒక వివేకానందుని లాంటి మహాపురుషుని దేశానికి కాదు ప్రపంచానికి అందించిన ఆయన గుర్చి యెంత చెప్పినా ఇంకా యేదో మిగిలి పోతూనే ఉంటుంది."Naren will rock the world" అని తన ప్రియ శిష్యుని గూర్చి యెంతో ముందుగానే ఆయన అన్న మాటలు వూరికే యెలాపోతాయి...!!!
ఆ రోజుల్లో British వారి గుర్చి ప్రస్తావాన వచ్చినప్పుడు ఇలా అంటారు " ఆహా....ఈ శ్వేత ముఖులలో యెంతటి యేకాగ్రతా శక్తి ఉంది" అంటారు.
Chala baagundandi post. Ilaanti mahaanubhaavula gurinci pratidinam talcukovaali. Lekunte samsaaraanni eedadam chaalaa kashtam. Veeri Bodhanale mana jeevitaaniki chukkaani lu.
ReplyDelete