Monday, August 6, 2012

మగవాడిని యెన్నుకునే విషయంలో నాయర్ స్త్రీ కి పూర్తి స్వాతంత్రం ఉంటుంది


కేరళ లో మాత్రుస్వామ్యం గురించి చెప్పుకోవాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి.నంబూద్రి బ్రాహ్మణులకి,నాయర్ (shudras ascended to kshatriya status)లకి అవినాభావ సంబంధం ఉంది.గత కొన్ని వందల సంవత్సరాలుగా ఒక ఆచారం అక్కడ ఉంది.యేమిటంటే బ్రాహ్మల లోని పెద్ద కొడుకు మాత్రమే తమ సామాజిక వర్గం లోని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.అతని తమ్ముళ్లు నాయర్ లలోని అమ్మయిలతొ సంబంధం పెట్టుకుంటారు. అంటే రాత్రి పూట వచ్చి ఆ కార్యక్రమం కానిచ్చుకుని వెళ్లవచ్చు.ఇదేదో అక్రమ సంబంధం అనుకోకండి.నాయర్ అమ్మాయి ఇష్టం తోనే ఇది జరుగుతుంది.ఆ కుటుంబాల్లో ఆచారాలు అందుకు అనుమతిస్తాయి.దీనికి కొన్ని తంతులు కూడా జరుగుతాయి.


మగవాడిని యెన్నుకునే విషయంలో నాయర్ స్త్రీ కి పూర్తి స్వాతంత్రం ఉంటుంది.ఒక సమయంలో అనేకమందితో ఉండటం ఉండదు.ఈ community లో ఒక భర్త ని వదిలేసిన తర్వాత ఇంకో భర్త ని యెన్నుకోవడం తప్పు కాదు.వరసగా ఆరుగురు భర్తలతో ఆరుగురు పిల్లలని కన్నా అది ఆశ్చర్యకరమైన విషయం కాదు.


నంబూద్రిలు పిల్లల్ని కనడానికి తప్ప వారికి యెమి భాద్యత ఉండదు.నాయర్ స్త్రీ యొక్క పెద్ద సోదరుడు ఆమే అస్తిని రక్షించాలి.అలాగే మేన మామ గ అతను తన ఇంటి పేరుని సోదరి పిల్లలకి ఇవ్వాలి.అయితే నాయర్ కుటుంబాల్లోని ఆడవాళ్లు కూడా చాలా తెలివిగా తమ విషయాల్ని స్వతంగా చూసుకోవడం లో సిద్ధహస్తులు.


ఆస్తిపాస్తులు గల కుటుంబాలు కూడా యెక్కువగానే ఉంటాయి.ఈ taravada ఆచారం ఇప్పుడు తగ్గుముఖం పట్తినట్టు చెప్పవచ్చు. నాయర్ పురుషులు సంఘాలుగా యేర్పడి మొత్తానికి దిన్ని రూపు మాపారు.అయినప్పటికి నాయర్ స్త్రీల స్వతంత్రత మనకి కేరళలో అడుగడుగునా కనబడుతుంది.మగవారి మాదిరిగా దూర ప్రదేశాలు వెళ్లి ఉద్యోగం చేయడానికి వెనుదీయకపోవడం అనేది అక్కడ యెప్పటినించో ఉంది.బహుశ వారి వారి స్వాభావిక  పరిస్థితులే క్రియాశీలక రంగంలో యెలా వుండాలో నేర్పుతాయి.


NOTE: Nayar ladies are very beautiful and strikingly rich in  almost every pursuit of their undertaking .We discuss it separately.






   

No comments:

Post a Comment