Tuesday, August 7, 2012

మన తెలుగు politicians చాలామంది delhi లో ప్రెస్ మీట్ లోనో,పార్లమెంట్ లోనో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వారి భావ వ్యక్తీకరణలోని బలహీనత,readinglessness చాలా స్పష్టంగా కనబడుతుంది.


మన తెలుగు politicians చాలామంది delhi లో ప్రెస్ మీట్ లోనో,పార్లమెంట్ లోనో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వారి భావ వ్యక్తీకరణలోని బలహీనత,readinglessness  చాలా స్పష్టంగా కనబడుతుంది.అదే తెలుగులో అనండి విరగదీస్తారు..దాంట్లో సందేహం లేదు. జాతీయ స్థాయిలో మన వాణి వినిపించాలంటే తప్పనిసరిగా హింది లోనో ఇంగ్లీష్ లోనో మాటాడి తీరాలి.మీరెప్పుడైనా delhi వెళ్లి చూడండి.ఇంగ్లీష్ మీడియ కున్న గౌరవం యేమిటో అర్థం అవుతుంది.వాళ్లు ఇంగ్లీష్ లో డొక్క శుద్ది ఉన్నవారికి ఇచ్చే కవరేజి తేడాగా ఉంటుంది.

ప్రతిరోజు ఒక అరగంటో,గంటో మంచి ఇంగ్లీష్ fiction గాని,పుస్తకాలు గాని  చదివితే ఆ తెలివిడితనం మన మాటల్లో ధ్వనిస్తుంది.కాని మన వాళ్లకి అంత తీరిక యెక్కడ వుంటుంది చెప్పండి. నాకు తెలిసినంతలో జైపాల్ రెడ్డి, దగ్గుబాటి పురంధరేశ్వరి,రేణుకా చౌదరి,అశోక గజపతి రాజు,సి.రామచంద్రయ్య లాంటి వాళ్లు మంచి ఇంగ్లిష్ మాటాడతారు. చక్కగా వినాలనిపిస్తుంది.k.c.r. లో కూడ డొక్క శుద్ది కనబడుతుంది.

చిదంబరం ,అరున్ జైట్లి,జయ లలిత ఇలాంటి వారి తర్క బద్దమైన ఉపన్యాసం లేదా మాటలు వినే వారికి హాయిగా ఉంటాయి.ఇంచు మించుగా ఆంధ్ర ప్రదేష్ లో నున్న m.p. ల సంఖ్యపై ఆధార పడే central govrnment నిలబడి  వుంది.అయినా మనకి ఇవ్వవలసినంత ప్రాధాన్యత పదవుల పంపిణి లో గాని,నిధుల కేటాయింపులో గాని ఉండదు.దీనికి మనవాళ్ల communcation skills లోనున్న లోపం కూడానేమోననిపిస్తుంది.

మాట శక్తిని అంత చులకనగా చూడకండి...దాని మీద ప్రపంచమే అధార పడి వుంది...ఇది తమిళ కవి తిరువళ్లువర్ అన్నమాట.  


         

No comments:

Post a Comment