Monday, August 27, 2012

ఒకొక్క సారి యెవరి దైనా ఆర్టికల్ చదువుతుంటాం.దాంట్లో కొన్ని వాక్యాలు యెక్కడో చదివినట్టుగా అనిపిస్తాయి

ఒకొక్క సారి యెవరి దైనా ఆర్టికల్ చదువుతుంటాం.దాంట్లో కొన్ని వాక్యాలు యెక్కడో చదివినట్టుగా అనిపిస్తాయి.చాలా అద్భుతంగా,యెక్కడో హ్రుదయాన్ని తడితేనే అవి అలా లోపలే నిలిచిపోతాయి.అయితే మళ్లీ అవి యెవరైనా రచనలో చూసినప్పుడు మూలరచయిత పేరు చప్పున స్ఫురించదు.అవి తమ రచనలోనో,మాటల్లోనో బయటికి వచ్చినప్పుడు వాటికి మూల మైన source ని పేరుతో ఉదహరిస్తే బాగుంతుంది.అలా చేసినప్పుడు వాటిని ఉపయోగించుకున్నవారిపైన గౌరవం పెరుగుతుందే గాని తగ్గదు.కాని యెందుకనో కొంతమంది అలాచేయరు...అది తాత్కాలికంగా మేలు చేసినట్టుకనిపించిన మూల రచయిత యెవరో తరవాత తెలిసినప్పుడు మోసపొఇన ఫీలింగ్ కలిగి సదరు తాజా  రచయిత పై చికాకు యేర్పడుతుంది.ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరికి కలిగే ఉంటుందని నా నమ్మకం.

No comments:

Post a Comment