Tuesday, August 28, 2012

నిన్న ఈటీవి లో ప్రసారమైన "పాడుతాతీయగా" కార్యక్రమానికి అలనాటి గాయకుడు జి.ఆనంద్ అతిధిగా విచ్చేశారు


నిన్న ఈటీవి లో ప్రసారమైన "పాడుతాతీయగా" కార్యక్రమానికి అలనాటి గాయకుడు జి.ఆనంద్ అతిధిగా విచ్చేశారు.సహజంగా బాలు తనదైన చతురతతో అతిధులనుంచి అనేక జీవితానుభవాలు రాబడుతుంటారు.ఆయన చెప్పే ఇతర కబుర్లు ద్వారా మంచి entertainment కూడా ఇస్తుంటారు.మరి ఈసారి ఎందుకో ఆనంద్ తో అంత సరదాగా మనసు విప్పిమాటాడి నట్టుకనబడలేదు.ఒకరకంగా యేదో సీరియెస్ నెస్ ని participants పై లౌక్యంగా చూపించారు.ఇద్దరు contestants పరమ ఈసడింపులకి గురిచేసారు.ఈ విషయంలో కొత్త బాలు కనబడ్డాడు. 

ఆనంద్ అనగానే అమెరికా అమ్మాయి  సినిమాలో అతను పాడిన " ఒక వేణువు వినిపించెను " అనే పాట యెవరికైనా తప్పక గుర్తొస్తుంది.కనీసం ఆపాటని అతని స్వరం నుంచి మళ్లీ వినాలని చాలమంది ఆశించిఉంటారు. అసలు ఆ ప్రస్తావన లేకుందానే కార్యక్రమం అదోలా సాగిపోయింది.     

No comments:

Post a Comment