Thursday, August 9, 2012

అందుకే అన్నారు నేర్చుకునే ఆసక్తి లేనివాడు ఢిల్లి లో ఉన్నా ఒకటే, గల్లీ లో ఉన్నా ఒకటే అని...!


పోయిన సంవత్సరం డిసెంబర్ లో కేరళ వెళ్లడానికి కోర్బా ఎక్స్ ప్రెస్ యెక్కాను.మా బోగీ లోనే చాలామంది యెక్కారు.అంతా తెలుగు అయ్యప్పలు.సామాన్లు అవీ సర్దడం ..అంతా చాలా బిజీ గా ఉన్నారు.ఆ బ్రుందంలో ఒకాయన మాత్రం ఆదేశాలు ఇస్తూ హడావిడి చేస్తున్నాడు.పని మాత్ర్రం ఇతరులతో చేఇస్తున్నాడు.ఇంతకీ ఆయన యెవరయ్యా అంటే ఆ బ్రుందానికి  గురు స్వామి అట. రైలు ఆంధ్రా బోర్డర్ దాటే దాకా తెగ మాట్లాడుతున్నాడు. ఆయన మాటల ప్రకారం...ఆయన కేరళ కి వెళ్లడం 8 వ సారి అని ...వాళ్ల అబ్బాయి అమెరికా లో ఉన్నాడని తెలిసింది.

ఇంకో చిన్న స్వామి కి కేరళ గుర్చి చెబుతూ అక్కడ అంతా తమిళం మాటాడతారని ....ఇంకా యేమేమో చెబుతున్నాడు. ఇదేమిట్ర బాబు...కేరళ వాళ్ల భాష మళయాళం కదా ...అందామనుకున్నాను...చెప్పినా వినిపించుకునే మనిషి లా అనిపించలేదు...మనకెందుకులే అని ఊరుకున్నాను.ఆయన యెంతో అభివ్రుద్ది చెందిన ప్రంతం నుండి వచ్చిన వాడే మళ్లా. 

అందుకే అన్నారు నేర్చుకునే ఆసక్తి లేనివాడు ఢిల్లి లో ఉన్నా ఒకటే, గల్లీ లో ఉన్నా ఒకటే అని...!

1 comment: