Friday, October 19, 2012

పునర్జన్మలు ఉన్నాయా...?


పునర్జన్మలు ఉన్నాయా...?జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ సందేహం రాని వారు ఉండరేమో...!మనకు అంతర్లీనంగా కలిగే చాలా విషయాలని బయటికి అనేక కారణాల వల్ల వ్యక్తపరచలేము.అయితే అవి అలా  లోపల తిరుగుతూనే ఉంటాయి.యెప్పుడో ఓ సారి ఉన్నట్టుండి చిన్న చిన్న వెలుతురు దివ్వెలు కనబడుతుంటాయి. మనం సహజాతాలు అనుకునే స్థాయిలలో మన పూర్వ జన్మ సంస్కారాలు చాలా లీలగా కనబడుతుంటాయి.ఒక జన్మలో ఆపివేసిన కొన్ని విషయాలు మళ్ళీ జన్మలో తగిన సమయంలో అందుకుంటాయి. దీనికి వయసు అనే barrier కూడా యేమీ లేదు అనిపిస్తుంది.39 సంవత్సరాల తన జీవిత కాలంలోనే స్వామి వివేకానంద 1200 సంవత్సరాల ఆధ్యాత్మిక కృషి చేసారని నా భావన.రాజ యోగం పై ఆయన వ్యాఖ్యానం ...ప్రతి వాక్యంలోను ఒక ఉద్గ్రంధం రాయదగ్గ లోతు ఉంది.He was the first yogi crossed tha sea &delivered the Indian philosaphy in English. ఆయన కొటేషన్స్ మాత్రమే గాక complete works చదివితే ఆయన మన భారతీయ ధర్మాన్ని యెంత ప్రేమించాడో పాశ్చాత్య నాగరికత లోని practicality ని అంతకన్నా యెక్కువ గా అభిమానించాడు అని అర్ధం అవుతుంది..! అలాంటి ఒక గొప్ప 

 జీనియస్ గా "ఓషో"ని  చెప్పవచ్చు.ఇంచు మించు వివేకానందుని భావ జాలన్ని  


 పరిస్థితులకి తగ్గట్టుగా మలిచి ఇంకాస్తా దాన్ని ముందుకు తీసుకు వెళ్ళాడు. "ఓషో"


 అంటే ఇష్టపడని వారు ఒక్కసారి ఆయన discourses చదివితే ఆ లాజిక్ మనల్ని 
మామూలుగా వెంటాడదు. "సుఖభోదానంద" లాంటి వారు ఆయన వాయిస్ని,చెప్పే 
విధానాన్ని మక్కీ కి మక్కీ అనుకరిస్తుంటారు. యెందుకో ఇలాంటి మేధస్సు ఒక్క 

జన్మలో కృషి చేసి సాధించినట్టుగా అనిపించదు.పూర్వ జన్మలు వున్నాయా అని ఒకాయన అడిగితే "ఓషో"  ఇలా అంటాడు."Every death is just like a small sleep.గత జన్మ స్మృతులు గుర్తుకు రాక పోవడం కూడా ప్రకృతి చేసుకున్న ఒక యేర్పాటు.ప్రతి ఒక్కరికి అలా గుర్తుకు వచ్చినట్టయితే ప్రపంచం గందర గోళంగా తయారవుతుంది.యేమో నీ భార్య గత జన్మలో నీ తల్లి అయిఉండవచ్చు....! " 

తాను గత జన్మలో బెల్జియం లో ఒక మతాధికారిగా జన్మించానని చెబుతాడాయన.
        























1 comment: