God Father నవల లోని Don Corleone పాత్ర నన్ను ఎప్పుడూ వెంటాడే పాత్రల్లో ఒకటి.రచయిత Mario Puzo ఆ పాత్ర ద్వారా కృష్ణ పరమాత్మ లాంటి తత్వవేత్త లా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.అనుభవం తో వచ్చే ఒక ముందు చూపు,మానవ స్వభావం పై అధికారయుతమైన జ్ఞానం ఆ పాత్రలో తొణికిసలాడుతుంటాయి.తన సిసిలీ మూలాలపై అతడికి గల అభిమానం ముగ్ధుల్ని చేస్తుంది.భార్య పట్ల చూపే అనురాగం,కుమారులపై అతడు కనబరిచే ప్రేమ...అతని చర్యల ద్వారా ,మాటల ద్వారా కొడుకులకి లోకం యొక్క నిజ స్వభావం తెలియజేయడం హృద్యంగా ఉంటుంది.ఒక చోట కుమారుడు Michael తో మాట్లాడుతూ అంటాడు." Your Sons are your trusted soldiers". లోతుగా ఆలోచిస్తే దీనివెనుక ఎంత అర్ధం వుంది అనిపిస్తుంది.
అలాగే స్నేహం యొక్క విలువని ఎంత క్లుప్తంగా ,తన attitude ద్వారా తనచుట్టూన్న వాళ్ళకి చెబుతాడంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది.ఆ సన్నివేశం ఆసుపత్రి లో జరుగుతుంది.సరే...అది ఇంకోసారి ప్రస్తావించుకుందాము.
No comments:
Post a Comment