ఈ రోజు పేపర్లో చూశాను.మన టిఎస్సార్-టివి 9 వారు ఏదో సినిమా వాళ్ళని సన్మానించే కార్యక్రమం చేస్తున్నారని..! 2011 కి మరియు 2012 కి ఉత్తమ నటులుగా బాలకృష్ణ,నాగార్జున లని ఎంపిక చేశారట.మళ్ళీ కేంద్ర మంత్రి తో ఎందుకు తంటా అనికాబోలు యధాశక్తి అల్లు అర్జున్,రాంచరణ్ లకి కూడా కొన్ని ఆవార్డ్ లు వున్నాయండోయ్.!
ఇంతాచేసి ఇదంతా ఎందుకంటే జాతీయ స్థాయిలో మనాళ్ళని up చేయడానికట.ఎందుకంటే ఆ లెవల్ లో మన నటుల్ని ఎవరూ గుర్తించడం లేదట..ఇది TSR గారి వువాచ. cheap commercial సినిమాలు తప్ప ఆ లెవల్ కి మనాళ్ళు తీసిన కళాఖండాలు ఏమిటో నాకర్ధం కాలేదు.!
అయ్యా ...మీకు మీకు యేవో మొహమాటాలు వుంటాయి...కాబట్టి కొన్ని తప్పవులే గాని నిజంగా మీకు కళామతల్లిని గౌరవించాలని వుంటే కొత్త Talent ని కూడా కొంత ప్రోత్సహించండి.మొదటి సినిమాలోనే ఆకర్షించే విధంగ నిపుణత చూపించిన technicians కి కూడా కొన్ని అవార్డులు ప్రకటించండి.
No comments:
Post a Comment