బాగున్న దాన్ని వెంటనే బాగుంది అంటే దాని గొప్పేం వుంటుంది..? ఒక ఉదాహరణ తీసుకుందాం...యండమూరి రాసిన ఆనందో బ్రహ్మ బాగుంది అనండి..వెంటనే ఒకాయన ఆలశ్యం చేయకుండా అందుకుంటాడు..ఆ క్షుద్ర రచయిత కదా..అంతా కాపీ యే గదా..అంటూ అవలీలగా తూలనాడతాడు.మిగతా వి యేవో ఒకటి రెండు అలా రాసినవి వుండచ్చేమో...గాని దీనికీ దానికి సంబందం ఏమిటో అర్ధం గాదు.
ఒకదాంట్లోని పొరపాటు ఎత్తిచూపించడానికి తన అమూల్యమైన సమయాన్ని ఎంతైనా వుపయోగిస్తాడు ..కాని బాగున్నదాన్ని శబాష్ అనడానికి మాత్రం వెంటనే నోరు రాదు.కలము ముందుకు కదలదు.ఒక వ్యక్తి చనిపోతే తప్ప వాడి గొప్పదనాన్ని మన తెలుగువాడు అంగీకరించడు.ముఖ్యంగా సాటి తెలుగు వాడి గొప్పదనాన్ని.అవసరమై రాయాలనుకున్న పక్క రాష్ట్రాల వారినో,దేశాలవారినో ఇంటర్వ్యూ చేసి రాస్తాడుతప్ప సాటి తెలుగువాణ్ణి మాత్రం పైకి ఎత్తడు.! అయితే దీంట్లో చిన్న exemption వుంది.సొంత సామాజిక వర్గం వారికి అప్పుడప్పుడు మినహాయింపు ఉంటుంది.
Click here
No comments:
Post a Comment