ఈమధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో గుర్తుపెట్టుకోదగ్గ పాట ఒక్కటి రావడం లేదు.సినిమాలు మటుకు పుంఖానుపుంఖాలుగా రిలీజ్ అవుతున్నాయి.జనాల్లో గాని రసికత తగ్గుతున్నదా అంటే అదేమీ కాదు అనిపిస్తోంది.ఎందుకంటే పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలు మంచి ఆదరణకి నోచుకొంటున్నాయి అంటే ఇంకా చక్కని సంగీతాన్ని ఆపాత మధురాల్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారనేకదా దాని అర్ధం..!
మన తెలుగు సినిమా మేకర్ల లోనే రస దృష్టి కొరవడుతున్నదని నా అనుమానం.ఓ రకంగా చెప్పాలంటే అప్పుడప్పుడు వచ్చే డబ్బింగ్ సినిమాల్లోనే చక్కని సాహిత్యము..ట్యూన్స్ వస్తున్నాయి.పెద్ద హీరోలనబడే సినిమాల్లోని పాటల చిత్రీకరణలో చూపిస్తున్న శ్రద్ద పాటల మధురతలో కూడా తీస్కొంటే మంచిది.హిందీ గాయకుల గొంతులు మన బడా హీరోల కి ఏ మాత్రం సూట్ కాకపోవడం అటుంచి చాల ఎబ్బెట్టుగా pronunciation ఉంటోంది.
More news here
కీ.శే.పి.బి.శ్రీనివాస్ గారు చెప్పారట ఒక సారి ఇలా "మేము పాడే రోజుల్లో అన్నీ ఆల్ టైం సాంగ్స్' వచ్చేవి ఇప్పుడన్నీ 'హాల్ టైం సాంగ్సే' వస్తున్నాయి అని.
ReplyDelete