గత పాడుతా తీయగా కార్య క్రమం గూర్చి కొన్ని ముక్కలు రాసి తీరాలి.ఉగాది పాటలు ముందు పాడటం బాగుంది.అయితే పూర్తిగా కాకుండా కొన్ని లైన్స్ పాడించటం సబబు గానే ఉంది.దాని వల్ల మిగతా పాటలకి సమయం సరిపోయింది.ఒక చిన్న పాప "చిన్ని చిన్ని కోయిలలే" అనే పాట ఎంచుకొని పాడటం చాలా బావుంది.అది మౌనరాగం అనే సినిమాలోది అనుకొంటాను.దాంట్లో ఇళయరాజా కంపోజిషన్ ఎంత బాగుంటుందో..ముఖ్యంగా..ఇంటర్ల్యూడ్ వాయిద్యాలు..ఖోరస్ చాల అనిర్వచనీయమైన రసానందానికి గురిచేస్తాయి.ఆ మహానుభావుడు ఇళయరాజా పాటలకి expiry date వుండదనుకుంటాను. .తమిళుల్లో నేను గమనించినది యేమంటే ఎంత ఎదుగుతుంటే అంత humbleness తో వుంటారు..మనవాళ్ళకి కొద్దిగా పేరు వస్తే చాలు విపరీతమైన పొగరుగా మాట్లాడుతుంటారు.ఇక నటుల్లోనైతే చెప్పనే అవసరం లేదు.
More news here
More news here
No comments:
Post a Comment