Wednesday, April 24, 2013

ఇండియా అనే మన దేశ నామాన్ని పూర్తిగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది


ఇండియా అనే మన దేశ నామాన్ని పూర్తిగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.దానికి బదులుగా భారత్ అనే పేరునే అన్ని చోట్లా అధికారికంగా వాడాలి.పాశ్చ్యాత్యులు ఇండియన్లు అనే పేరుని నాగరికత లేని ఆదిమ సమాజాలకి ఇంకా ఒక రకమైన చులకన భావంతో ఉపయోగిస్తారు.వాళ్ళ అప్పటి ఆ అభిప్రాయాలకే విలువనిస్తూ ఇంకా మనల్ని మనం ఇండియన్లు గా పిలుచుకోవడం మానాలి.

కొలంబస్ కొంత మంది ప్రజలని  రెడ్ ఇండియన్స్ అన్నా..వెస్ట్ ఇండీస్ అని కొన్ని దీవులకి పేరు పెట్టినా దాని వెనుకనున్న అర్ధం తూష్ణింభావమే తప్ప మరొకటికాదు.indus నాగరికత కనక india అన్నారు అని వాదించే మహానుభావులూ వున్నారు.అది ఒక ముసుగు తప్ప మరొకటి కాదు.పరాయి జాతుల అభిప్రాయం మేరకు కాకుండా మనల్ని మనం గౌరవంగా పిలుచుకోవడం జరిగితేనే బయటి వాడూ విలువనిస్తాడు.    

More news here

1 comment:

  1. I also got same opinion.
    Thanks for explaining clearly. :)

    ReplyDelete