Sunday, April 28, 2013

అసలు రేప్ లు ఎందుకు జరుగుతున్నాయి..? (Part-1)


అసలు రేప్ లు ఎందుకు జరుగుతున్నాయి..? ఈ మధ్యన ఏ పేపర్ లో చూసినా ఇవే వార్తలు..!ఈ రేప్ ల పరంపర చదువుతుంటే పిస్తోల్ తీసుకెళ్ళి కాల్చి పారేయాలన్నంత కోపం వస్తుంది.అంతగా ఆపుకోలేనంత libido పొంగి ప్రవహిస్తుంటే ఈ పవిత్ర దేశంలో బ్రోతల్ హౌస్ ల కేమి తక్కువ..!వెళ్ళి ఆ రోజుకి దింపుకొని రావచ్చుగా..! చాలామందిమి sex గూర్చి ఆలోచన నిజాయితిగా చేయకపోవడం మన దేశంలో ఓ దురదృష్ట కర విషయం.శీలం అంటే మనకి కేవలం స్త్రీ యొక్క శారీరక విషయం తప్ప ఇంకొకటి కాదు.

అలాంటి ఈ సమాజం లోకి ఒక్కసారిగా ఇంటర్నెట్ విప్లవం రావడంతో మంచితో పాటు చెడు వున్నట్లు బ్రహ్మాండమైన "పోర్నోగ్రఫి" కూడా అందుబాటులోకి వచ్చింది.ఒక్క ఫింగర్టిప్ తో ఎన్ని రకాలైన సెక్స్ భంగిమల్నైన అతి ఈజీ గా చూడవచ్చు. అంతేకాదుసుమా ఆడా..మగా శరీరాలతో ఎంత వికృతానందాన్ని ఎన్ని రకాలుగా పొందవచ్చునో అన్ని రకాలైన సన్నివేశాలు హాయిగా చూడవచ్చు.స్కూల్ పిల్లలు ,కాలేజి పిల్లలు ఆబగా వస్తుంటారు..సైబర్ కేఫ్ లకి..!ఒక్క నిమిషం ఆగండయ్య cabin ఖాళీ లేదు అంటే ఎంత నిరాశగా ఫీలవుతుంటారంటే అది వర్ణించలేము.

మరి ఆ లేత వయసులో పడిన భావాలన్ని ఎక్కడికి పోతాయి...? ఇంకో రకం పర్వర్షన్ జనాలు వున్నారు.రోజుకో నీలి చిత్రం చూడందే ఆ పూటకి ఏమీ చేయలేని స్థితి.అసలు ప్రభుత్వం "పొర్నొ" సైట్ లని రానివ్వకుండా చేయవచ్చుగదా..!అదొక పెద్ద అంతర్జాతీయ వ్యాపారం...దాన్ని కదిలిస్తే కూసాలు ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతాయో చెప్పలేము.
                                              (సశేషం)
             
More News here

No comments:

Post a Comment