ఇంటర్నెట్ లో పొర్నొ సైట్లు చూసేవాళ్ళకి ఆ విధమైన ప్రయోగాలు చేస్తే ఎలా వుంటుంది అనే కోరికలు కూడా పెరుగుతుంటాయి.కొంతమంది సాటివాళ్ళ లో చులకన అవుతామనో..పరువు పోతుందనో ..లేదా భయపడో మూసుకుని కూర్చుంటారు.ఇంకొంతమంది తగిన అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలని చూస్తారు.చిన్న పిల్లల పైన వీళ్ళ ప్రతాపం చూపిస్తుంటారు.మనం పేపర్లలో ఈ తరహా వారిని గూర్చి చదువుతుంటాము.
ఆకలి తీరినతరవాత మనిషికి కావలసింది..ఆలోచించేది సెక్స్ గురించే..!మరెందుకనో సృష్టి లో దాంట్లో అంత ఇది..!లంచానికి లొంగనివారు కూడా మంచానికి దాసోహం అంటారు.ఎంతచేసినా ఇది ఇంతేలే అని అనుకుంటా..చాలా western దేశాల్లో prostitutes కూడా licence ఇచ్చి పారేశారు.
తల్లిదండ్రులపై వున్న కోపాన్ని వాళ్ళ పిల్లలపై చూపించడానికి గాను చిన్నపిల్లలపై అత్యాచారాలు చేసేవాళ్ళు కొంతమంది.ఒక రకంగా చెప్పాలంటే ఇది కక్ష సాధింపు లాంటిది.
అసలు సెక్స్ ఏమిటి..ఆ ఫీలింగ్ ని ఎలా వ్యక్తం చేయాలి..ఎలా దాన్ని అదుపులో పెట్టుకోవాలి అనేది చదువులో ఒక భాగంగా చెప్పాలి.అసలు అన్ని చదువులకంటే ఇది చాలా ముఖ్యమైనది.ఇప్పుడు భారతీయ సమాజం ఒక సంధి యుగంలో వుంది.అది మార్పులకి సంబందించి..!ముఖ్యంగా సెక్స్ లాంటి విషయాలకి సంబందించి..!
ప్రతి ఒక్కరి ఇళ్ళలోను ఆడ,మగ పిల్లలు వుంటారు.ఎవరికో..ఎక్కడో జరిగిందిలే అని సరిపెట్టుకోకూడదు.ఇంకొక రోజు మనదగ్గరలోనే జరగవచ్చు.కనక అలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు వాటిని వుదాహరణలుగా తీసుకొని case study చేయాలి.ఎందుకంటే అన్నిటికి కారణాలు ఒకటే వుండవు.
రేప్ చేసిన వాడి ని నపున్సకుడిగా మార్చాలని కొంతమంది అంటుంటారు.వినడానికి ఇది బాగానే వున్న ఇది చాలా ప్రమాదకరమైనది.ఎందుకంటే అలాంటి శిక్ష పొందినవాడు ఆడ పిల్లలపై మరింత కక్ష పెంచుకొని తెలివిగా హత్యలకి పాల్పడే అవకాశం వుంది. దానికంటే ఉరి శిక్ష వేసి పైకి పంపించడమే క్షేమం..!
More news Here
No comments:
Post a Comment