Tuesday, April 30, 2013

నిన్నటి పాడుతా తీయగా గురించి నాలుగు ముక్కలు..!



పిల్లలు కాదు పిడుగులు అనే మాదిరిగా పాడుతున్నారు అంతా కూడా..!సాగర సంగమం సినిమానుంచి వేవేలా గోపెమ్మల మువ్వా గోపాలుడే అనే పాటకి ఆర్కెస్ట్రా కొన్ని చోట్ల సరిగా కుదరలేదు.ముఖ్యంగా మొదటి చరణం తరువాత వచ్చే ఇంటర్ల్యూడ్ లో సన్నాయ్..వేణువు సంగతులు అంత perfect గా అనిపించలేదు.సరే వారి పరిమితులు వారికి వుండవచ్చు.పాత పాటల్లో మంచి పాటల్ని ఎంచుకున్నారు.1970 నుంచి 1980 లేదా 85 దాకా వచ్చిన పాటలు చాల Golden songs వచ్చాయి తెలుగులో..!

రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్నినీలో....అనే పాట ఎవరైనా పాడితే బాగుణ్ణు.అలాగే తనివి తీరలేదే..నామనసునిండ లేదే..అనేది కూడా..! 

No comments:

Post a Comment