Friday, May 17, 2013

అదేంటోగాని పేపర్ చదవాలంటేనే నీరసంగా నిస్తేజంగా అనిపిస్తోంది రోజు రోజుకి..


అదేంటోగాని పేపర్ చదవాలంటేనే నీరసంగా నిస్తేజంగా అనిపిస్తోంది రోజు రోజుకి..!అన్నీ Negitive వార్తలే..!అక్కడ జరిగిన ఆక్సిడెంటు...రక్తపాతం!ఇంకోచోట ఎక్కడో మర్డరు..దాని భీబత్స వివరాలు...అదేదో ఊరిలో వావి వరసలు మరిచిన లైంగిక సంబంధాల గొడవలు...పాఠశాలకి రాకుండా జీతాలు దిగమింగుతున్న పంతుళ్ళు...ఇంకా ఇలాంటి రాక్షస వార్తలే..!కొన్ని వదిలేశాను..అవన్నీ రోజూ చదివే మీకు తెలుసు గదాని..!

ఎంతసేపూ మనిషి నెగిటివ్ కోణాన్ని చూసీ చూసీ పాజిటివ్నెస్ ని appreciate చేసే గుణాన్ని కోల్పోతున్నాడు.ఒక చెడు జరిగినప్పుడు చూపించక పోతే ఎలా అని సందేహం రావచ్చు. ఖచ్చితంగా చెడుని దునుమాడవలసిందే..!అదే సమయంలో ప్రతి నెగిటివ్ వార్త కి కాకపోయినా ...కనీసం రెండు వార్తలకి ఒక పాజిటివ్ వార్తని ప్రచురించాలి.అప్పుడే ఆయా రంగాల్లో పనిచేసే నిజాయితీపరులు నిరుత్స్త్షాపడకుండా వుంటారు.

ఈ ప్రపంచంలో ప్రతి రంగంలో చెడు ఎంత వుందో ..ఇంకో వైపు మంచీ అంతే వుంటుంది.చూడగలిగే సహృదయత వుండాలి.మానసిక శాస్త్ర పరంగా విశ్లేషణ చేసినా రోజూ దయ్యాల గురించే ఆలోచిస్తూ..చదువుతున్నా మనిషి దయ్యంగానే మారిపోతాడు కొన్నాళ్ళకి..!  

3 comments:

  1. ఇంకో ముఖ్యమైన వార్త మరచినట్టున్నారు. ఒక పార్టి నుంచి ఇంకో పార్టి కి కప్ప గంతులు వేస్తున్న రాజకీయనాయకులు. :)

    ReplyDelete
    Replies
    1. నెనర్లు జలతారు వెన్నెల గారు..!

      Delete
  2. "జనాలు చదివేదే వ్రాస్తాము, ప్రేక్షకులు చూసేదే చూపిస్తామని" వారిని వారు మోసగించుకుంటున్న మీడియాని చూసి నిస్పృహ చెందాలిసిన పనిలేదు. ఇప్పుడే ఈ కాలంలోనే చెడు ఉన్నదా అని అంటే ఒకాయన చెప్పాడు; పురాణాల్లో రాక్షసులందరూ పురాణాల కాలం వారే కదా, మరి అప్పుడు కూడా చెడు ఉన్నట్లే కాదా అని. నిజమే చెడు ఎప్పుడూ ఉన్నది. కాకపోతే మీడియా వెర్రితలలు వలన లక్షల, కోట్ల మంచి కాకుండా, వందల చెడు మాత్రమే ప్రచారం అవుతోంది. ఆ చెడుకి వేసిన శిక్షలు మాత్రం ప్రచారం అవటం లేదు. ఈ విధమైన మీడియా పద్దతి వల్లనే "ఆ అంతా చెడే కదా మనం మాత్రమే మంచి ఎందుకని, వందలలో ఉన్న చెడుని వేలల్లోకి తెస్తున్నారు కొందరు". అందుకే దీనిని ఉద్దేశించే అన్నారు; "చెడు కనవద్దూ, చెడు అనవద్దూ, చెడు వినవద్దూ" అని. కానీ, ఈ మూడు తప్పులూ చేస్తున్న మీడియా వల్లనే చెడు మరింత ప్రచారాన్ని పొందుతున్నది.

    ReplyDelete