తెలుగు బ్లాగర్ల meet లు ఎవరూ ఈమధ్య ఏర్పాటు చేస్తున్నట్టుగా లేదు.లోకల్ గా అక్కడక్కడ అనుకుని కొంతమంది కలుసుకొంటునట్టు అర్ధం అవుతోంది.కొన్ని వార్తలు అక్కడక్కడ చూస్తున్నదాన్ని బట్టి..!
ఇండి బ్లాగర్ వాళ్ళు అప్పుడప్పుడు ఏర్పాటుచేస్తున్నట్టుగా ఎవరైనా individual sponsors గాని కార్పోరేట్ వాళ్ళు గాని చేస్తే బాగుంటుంది గదా..!
ఓసారి తిరుపతి లో..ఓసారి విశాఖ లో ఓసారి ఇంకో చోట ఏర్పాటు చేయడానికి ఎవ్వరైన పూనుకొంటే బాగుంటుంది గదా..! ఆ ...అది అంత కలిసి రాదేమో లెండి..!ముఖ్యంగా మన రాష్ట్రంలో..!
దాని మైనస్ లు దానికీ వుంటాయి.. సరే ఏదో ఇలా కాలం వెళ్ళిపోతుందిగా...కానివ్వండి!
ఎవరైనా ఇండిబ్లాగర్ తరహా తెలుగు బ్లాగర్ల మీట్ ఏర్పాటు చేస్తే నిజంగానే బాగుంటుంది.
ReplyDeleteబ్లాగింగ్ అనేది పూర్తిగా ఎవరికి వారు వ్రాసుకునే విషయం. ఇందులో ఒక సమూహంగా చెయ్యగల పని ఎమీ లేదు. అందుకనే ఈ బ్లాగర్ల మీట్లు పెద్దగా జరగటం లేదు. ఎక్కడెక్కడో ఉంటూ, నెట్లో కలుసుకుని, వాళ్ళoదరికీ ఆసక్తి ఉన్న ఒక విషయం మీద వ్రాయటానికి ఒక పాతిక మంది బృధంగా ఏర్పడి అదే బ్లాగులో వ్రాస్తూ ఉంటే, వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుని వాళ్ళ బ్లాగు ముందు ముందు ఎలా ఉండాలో చర్చించుకోగలరు కాని, ఎవరికి వాళ్ళు వ్రాసుకునే బ్లాగర్లు కలిసి ఏమి మాట్లాడుకోవాలి!? అప్పటిదాకా పేరు మాత్రమే తెలిసిన మనుషులను వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుకోవటం మినహాయించి మరే కారణమూ లేదు.
ReplyDeleteఈ మధ్య హైదరాబాద్ లో బ్లాగర్ల మీట్ జరిగింది. నేను వెళ్ళ లేక పోయాను . వివరాలు ఒక బ్లాగర్ తన బ్లాగు ద్వారా తెలియపరిచారు.
ReplyDeleteఆశ్చర్యం. నేనుండేదీ భాగ్యనగరం లోనే. ఈ సమావేశం గురించి నాకే సమాచారమూ లేదు. బహుశః వారు ప్రముఖ బ్లాగర్లై ఉంటారేమో.
Delete