Tuesday, May 14, 2013

నిన్నటి పాడుతా తీయగా గురించి నాలుగు ముక్కలు..!




ఈ మధ్య కాలంలో బాలు కొద్దిగా extra talking తగ్గించి కాస్త కార్యక్రమం మంచిగా నడుపుతున్నాడని చూస్తున్నాను.మళ్ళీ తన పనికిరాని అనవసరమైన మాటలకి తెర తీసినట్టుగా అనిపించింది.చలెక్కి వుందనుకో...అనే పాట పాడిన అమ్మాయితో  చేసింది వ్యర్ధ సంభాషణలే..!సీతకోక చిలకలమ్మ అనే పాట పాడిన అమ్మాయితోనూ అంతే..!సొగసు చూడతరమా అనే టైటిల్ ఈ అమ్మాయికి వర్తిస్తుందట.అదీ ఆయన వువాచ.

ఇక వడ్డేపల్లి ఏమి కామెంట్ చేస్తాడో సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఈయన కామెంట్ చేయడం అదోరకమైన వినోదం.ఆయన చరణాలు బాగా పాడావు అంటే లేదు..లేదు మొత్తం బాగా పాడావు అంటాడీయన.

కేవలం తనవల్లనే పాడుతా తీయగా రక్తి కడుతోందని బాలు అనుకుంటే అంతకంటే హాస్యం ఇంకోటి లేదు.యమునా తీరం పాట ఆ కటక్ కుర్రాడు బాగా పాడాడు.అతనికి గొంతు ఇబ్బంది వుందని తెలిసీ అతడితో మళ్ళీ మళ్ళీ పాడమని అడగడం రాక్షసత్వం కాక మరేమిటి..?

ఈటీవి వారు తెలుగు వారి పై నున్న అభిమానం కొద్ది బాలు చేత దీన్ని నిర్వహిస్తున్నారు గాని..ఏ చిత్ర లాంటి వాళ్ళచేతనో చేఇంచినా కూడా మంచి రెస్పాన్సే వస్తుంది ఇలాంటి కార్యక్రమానికి...!!!

Click here



No comments:

Post a Comment