నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Sunday, May 12, 2013
మనవాళ్ళకి భొత్తిగా డ్రెస్ సెన్స్ వుండదెందుకని అనిపిస్తుంది..
మనవాళ్ళకి భొత్తిగా డ్రెస్ సెన్స్ వుండదెందుకని అనిపిస్తుంది..!ముఖ్యంగా విదేశీయులతో ..స్వదేశంలోగాని,పరదేశంలో గాని చర్చలు జరిపేటప్పుడు గాని...అంతర్జాతీయ సమావేశాల్లోగాని చక్కగా హుందా అయినా అందరికి ఆమోదయోగ్యమైన "సూట్" వేసుకోవచ్చుగదా..!దానివల్ల దేశీయ వస్త్రధారణకి ముప్పు ఏమీలేదు.నిజానికి China వాళ్ళు ఇంకా Japan వాళ్ళు వారి దేశంలో వున్నప్పుడు మనకంటే చాల విషయాల్లో సాంప్రదాయపరులుగా వుంటారు.ఇంగ్లీష్ ని మనకంటే అతి తక్కువ వుపయోగిస్తారు.medicine,engineering,space science లాంటి వాటిని కూడా వారి భాషల్లోనే చదువుకునే అవకాశం వుంటుంది. మరి అలాంటి వాళ్ళు విదేశీయులతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ వేదికలమీద మాత్రం "ఫుల్ సూట్" తో కనిపిస్తారు.Eat for you and dress for others అనే సూక్తి వెనుకనున్న అంతరాన్ని వారు గ్రహించారు ..! మన నాయకులు మన దేశంలో ఎలాంటి డ్రెస్నన్న వుపయోగించండి కాని బయటి దేశం వెళ్ళి నప్పుడు కాస్త హుందాగా కనిపించండి..!విదేశాలకి సంబందించిన సకల వస్తువులు హాయిగా వాడుకుంటాం.దేశవిలువని దిగజార్చే డ్రెస్సింగ్ మీ simplicity గా బయటివాళ్ళు భావించరు.
See here for more
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment