Thursday, May 9, 2013

నూతన పోకడల్ని బయట పెడితే గుత్తాధిపత్యాలు పోతాయి..!


మీ వాడెక్కడ చదువుకున్నాడు అంటే ఫలానా అమెరికా లో చదువుకున్నాడు అని చెప్పుకోవడానికో,ఎక్కడ వుద్యోగం చేస్తున్నాడు అంటే ఆస్ట్రేలియాలో లో అని చెప్పుకోవడానికో తప్ప ,నిజంగా ఆ దేశంలో వున్న పౌరులతో సమానమైన తెలివితేటలు గాని,wisdom గాని,దూరదృష్టి గాని ఆయా దేశాల్లో చదువుకొచ్చిన మన వాళ్ళకి వున్నాయా అంటే లేవనే చెప్పుకోవాలి.అక్కడి నుంచి వచ్చినాకా ఇక్కడ తమ పూర్వికులకున్న ఆస్తుల తోనో...పరపతి తోనో...సినిమాల్లోను (రొడ్డకొట్టుడువే),రాజకీయాల్లోను  తమ ని స్థిరపరచుకొంటారు.ఆ మాత్రం దానికి అక్కడి దాకా వెళ్ళి చదవడం దేనికి..? ఇండియా లో దొరకదా ఆ మాత్రం చదువు..? సూడో విలువలు అంటే ఇవే..!

విదేశాల్లో వచ్చే నూతన రీతులని ...వీళ్ళు ఇక్కడ ప్రవేశపెట్టి దేశ అభివృద్దికి యేమైనా కృషి చేస్తారా అంటే ఏమీ వుండదు.కొన్ని వాటిని ప్రవేశపెట్టాలంటే భయం కూడా..!ఇక వీరి contribution ఏమిటి మన సమాజానికి...ఆయా సమాజాల్లో నూతన పోకడల్ని బయట పెడితే గుత్తాధిపత్యాలు పోతాయి..! 

2 comments:

  1. మీ పోస్ట్ అలోచింపచేసింది.కులతత్వం,సినిమా పిచ్చి,రాజకీయాలు, ఒకరిని చూసి ఇంకొకరు ఓర్వలేనితనం, పోటీ మనస్తత్వం...ఎక్కువగానే ఉంది ఇక్కడ కి వలస వచ్చిన వారిలో..

    ReplyDelete
  2. Thanks for your comment jalataru vennela Garu!

    ReplyDelete