Monday, May 20, 2013

మరందుకే కవితాగోష్టులన్నా..అట్లాంటివన్నా జనాలు భయపడి చస్తుంటారు.


ఈ మధ్య ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళాను.చాలా Gap వచ్చిందిలెండి ఇట్లాంటి వాటికి attend అవ్వక..!జెనరల్ గా కవులు ..రచయితలు అంటే బుద్ది జీవులుగదా..ఎక్కడ ప్రసంగం ఆపాలో,శ్రోతల ఇబ్బందిని గమనించి ఎలా కవర్ చేయాలో తెలుస్తుంది గదా అనుకుంటాం.కాని సగటు రాజకీయుల speech కన్నా బోరు కొట్టించి వదిలారు.సరిగ్గ అన్నం సమయానికి ఒకాయన mike అందుకున్నాడు. ఆ ఆవిష్కరింప బడుతున్న పుస్తకం మీద కంటే తన పాండిత్యాన్ని చూపించడానికే రకరకాల definitions  తో కనీసం ఓ గంట ఊదరగొట్టాడు.వినేవాళ్ళు చాలా అసహనంగా తమ హావ భావాల్ని రకరకాల భంగిమల్లో వ్యక్తం చేస్తున్నారు.అబ్బే..మనవాడు అవేమీ పట్టించుకోడే..!

చాలా మంది లేచి వెళ్ళిపోవడం ప్రారంభించారు.వేదిక మీదనున్న మిగతా పెద్దలు కూడా అసహనంగా ఫీలవుతున్నారు.మళ్ళీ చెబితె ఏమి గొడవో నని..అలా పాపం దెబ్బతిన్న పిట్టల్లా చూస్తూన్నారు..!

నాకనిపించిది...బుద్ది జీవుల్లోనే ఒక ప్లానింగ్ లేక పోతే..మిగతా వాళ్ళలో ఎలా వస్తుంది.ప్రతి వుపన్యాసకునికి ముందుగానే ఎంతసేపు మాట్లాడాలో సమయాన్ని నిర్దేశించాలి.ఖరెక్ట్  ఎన్ని గంటలకి ముగించాలో అన్ని గంటలకే ముగించాలి.అటువంటిది ఏమీ లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు గంటలు..గంటలు ఊకదంపుడు మాటలకి కేటాయిస్తారు.ఇది ఏ రకమైన కార్యక్రమ నిర్వహణ...? మరందుకే కవితాగోష్టులన్నా..అట్లాంటివన్నా జనాలు భయపడి చస్తుంటారు.

Shadow Film Review Here

No comments:

Post a Comment