Tuesday, May 21, 2013

నిన్నటి పాడుతా తీయగా గురించి నాలుగు ముక్కలు!




యధాశక్తి పిల్లలందరూ మంచి పాటలు ఎంచుకొని పాడారు.మహబూబ్ నగర్ కుర్రాడు మాస్ లోని పాటని మంచి ఎనర్జీ తో పాడాడు.గోరటి వెంకన్న అథిధి ఈసారి. తన పాట,మాట చురుకుదనాన్ని ఫ్రదర్శించాడు.సంత background ని మంచి మాటల్లో హృద్యంగా కవితా రూపం లోకి మలిచాడు.ఏదైనా గాని మనిషి ఎంత తాదాప్యం చెంది ఒక భావాన్ని వ్యక్త పరుస్తాడో అది అంతే degree లో ఎదుటి వాడి లోపలిని తగిలి అలరింపచేస్తుంది.అది పాటగాని..మాటగాని..!మరందుకనే నేమో ఒక వాగ్గేయకారుడు అంటాడు.."భావములోనే భాగ్యముకలదే మనసా"...అని! 

ఈ ఓరుగల్లు ఎపిసోడ్ లు చూసిన తరవాత అందరకి ఒకటి అర్ధం అయి వుండాలి.తెలంగాణ యొక్క గుండె దేనికి స్పదిస్తుంది..ఎలాంటి సంగీతాన్ని ఆస్వాదిస్తుంది అని..!అసలు భాషని తెలంగాణ,ఆంధ్రా అని విడదీసి మాట్లాడడం అవివేకం.నాకు తెలిసి ప్రతి జిల్లాకి మన రాష్ట్రం లో ఓ రకమైన  తనదైన యాస వుంది. కాకపోతే పక్క పక్క జిల్లాల కి కొంత సామీప్యం వుండవచ్చు.కనుక నూటికి నూరు పాళ్ళు అచ్చమైన తెలుగు భాష అనేది spoken Telugu గా ఎక్కడా లేదు.

అయితే మనిషి చదువుకొంటున్న కొద్ది...నాగరికత లో పురోగమిస్తున్నకొద్ది సాధ్యమైనంత betterment ని మాతృభాష లో సాధించడానికి ప్రయత్నించాలి.అది ఒక జీవితావసరం..! అంతే తప్ప "వస్తుండ్రు.. పోతుండ్రు" అనే భాష లో మాట్లాడడమే అచ్చ తెలంగాణా భాష అనుకొంటే ఎట్లా..!

ఒక చారిత్రక పరిస్తితివల్ల ఉర్దూ భాష ప్రభావం వల్ల తెలుగు కొంత మార్పుగా ఇక్కడ కనబడుతుంది.కాబట్టి అదే మా శాశ్వతమైన భాష దాన్ని మార్చి మాట్లాడడం తెలంగాణా ద్రోహం అని ముద్ర వేయడం కూడని పని.ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కూడా తెలంగాణ భాషని గేలి చేయడం కూడదు.కొన్ని కొన్ని  అనివార్యమైన చారిత్రక ప్రభావాల వల్ల తెలుగు భాష ఇన్ని రూపాల్లో వెలుగొందుతోందని గ్రహించాలి.

సరే....చివరికి ఒక అమ్మాయి ఈసారి పక్కకి తప్పుకోవలసి వచ్చింది.మరి తప్పదు..పోటి కదా..!అయినా ఆ పిల్లల సేవలు కాలానుగుణంగా వాడుకోబడతాయి గనక మరీ నిరాశ చెందనవసరం లేదు.అసలు జీవితమే గెలుపు ఓటముల సంగమం కదా..దీని రుచి..కూడ వారికి అర్ధం కావాలి మరి...!


No comments:

Post a Comment