Friday, May 3, 2013

ఆ సంఘటన తో దయ్యాలు ఉన్నాయనే నాకనిపిస్తుంది...


ఆ సంఘటన తో దయ్యాలు ఉన్నాయనే నాకనిపిస్తుంది...!ఇది ఎప్పటినుంచో రాయాలని అనుకుంటున్నా ఇవ్వాటికి కుదిరింది.మొదటినుంచి దయ్యాలు,ఆత్మలు ఇలాంటి వాటి గురించి నాకు చాలా తేలిక అభిప్రాయం వుండేది.ఎవరైన వాటి గూర్చి చెబితే అదంతా నీ మానసిక భ్రమ అని కొట్టి పారేసే వాణ్ణి.

ఆ మద్య ఒక ఇల్లు కట్టించే పనిమీద దాని పక్కనే వున్న  ఒక ఇంటిలో వుండవలసివచ్చిది.అది మూడు పోర్షన్ల ఇల్లు. మొదటి దానిలో నేను వుండేవాణ్ణి.అప్పటికి నేను ప్రాణాయామం..ధ్యానం చెస్తుండేవాడిని.సూక్ష్మ శరీరాల గురించి చదివిన అనుభవం వుంది తప్ప ప్రత్యక్ష అనుభూతి యేదీ లేదు.

ఒకరోజు రాత్రి సుమారుగా పది గంటల సమయం ..!అక్కడ టి.వి. లాంటి వినోద సాధనాలు ఏమీ లేకపోవడం వల్ల మంచం మీదే పడుకొని ఇంటికి సంబందించిన విషయాలు ఆలోచిస్తున్నాను.కళ్ళు మూసుకున్నాను తప్ప అప్పటికి నిద్ర పోవడం లేదు.అది రూఢీ గా చెప్పగలను.

ఇంట్లో జీరో బల్బ్...మరీ వెలుతురు లేదు..అలాగని చీకటీ కాదు.ఒకవైపు ఒత్తిగిలి పడుకున్నాను.ఇంకా నిద్రపోలేదు..కళ్ళైతే మూసుకున్నానంతే..!కాసేపటికి ఎవరో తమ శరీరం వెనుక భాగాన్ని నాకు ఆనించి కుర్చున్నట్టుగా అనిపించింది.ఎవరు వచ్చారబ్బా ఈవేళప్పుడు..అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచాను.ఎవరు కనిపించలేదు.సరే లే  అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను.

ఓ అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ అలాంటి శరీరమే నాకు ఆనుకున్నట్టు అనిపించడమే కాక ఒక స్త్రీ యొక్క చీరలా స్పర్శ తలిగింది.అలాగే గమనిస్తున్నాను...చెయ్యి తో నా కాళ్ళ  ని రుద్దుతున్నట్టుగా అనిపించింది.ఇది నా భ్రమా అనుకుని ...అలాగే చాలా attention తో అన్ని గమనిస్తున్నాను.రుద్దుతూ..మెల్లిగా నా వెనుక అలాగే పై భాగానికి ఆ చేతి స్పర్శ రాసాగింది.విచిత్రమేమంటే నా పొట్టకి తన వెన్నుని ఆనిస్తూనే చేతిని క్రిందికి జరుపుతోంది.

నా వళ్ళు జలదరించిది..కొంపదీసీ ఇక్కడ దయ్యాలు గట్రా వున్నాయా..! అనిపించి కొద్దిగా మొదటిసారి భయం వేసిన మాట నిజం.మెల్లిగా కూడదీసుకొని లేచి ..మా ఆధ్యాత్మిక గురువులను స్మరించుకొన్నాను. ఆ తరవాత మంచినీళ్ళు తాగి పడుకున్నాను.

తెల్లారిన తర్వాత ఆ ఇంటి ఓనర్ ని అడిగాను." ఇక్కడ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా ఈ మధ్యన" అని.

"అవును..ఒకమ్మాయి కొన్నాళ్ళ క్రితం వురి వేసుకొని చనిపోయింది.. ఇంట్లో వాళ్ళు ప్రేమ వివాహానికి ఒప్పుకోక పోవడంవల్ల నని తెలిసింది" అన్నాడాయన. బలవన్మరణానికి గురైన వాళ్ళు కొంత కాలం మరణించిన చోట్లనే సూక్ష్మ శరీరాలతో ఉంటారనేది నిజమేనన్నమాట అనిపించింది.

ఇలాంటి అనుభవాలు ఇంక కొన్ని జరిగాయి.అయితె అవి అంత భయంకరమైనవి కావు.మళ్ళీ ఎప్పుడైనా ఆ సంఘటనలు రాస్తాను.ఇలాంటి అనుభూతులు మీకు ఎవరికైనా కలిగాయా..! ఇది ఎవరో నమ్మాలని..జడిపించాలని రాయలేదు.నా కొన్ని అనుభవాలు అక్షరబద్దం చేస్తే ఎవరికైనా future లో ఉపయోగపడతాయేమోనని రాశాను.    

2 comments:

  1. ఆల్ మోస్ట్ చాలా వరకూ అనుభవాలు ఇలానే ఉంటాయ్..కొంత మంది తమ పక్కనే ఎదో ఆకారం పడుకున్నట్టు చెప్పారు నాకు..ఈ టాపిక్ రాయాలంటే కొంచెం భయం నాకు..ఎదో ఒక అనర్ధం జరుగుతుంది..అన్న భయం వచ్చింది..

    ReplyDelete