Tuesday, May 7, 2013

నిన్నటి పాడుతా తీయగా గూర్చి నాలుగు ముక్కలు..!




ఓరుగల్లులో జరిగిన నిన్నటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినవారు వడ్డే పల్లి శ్రీనివాస్...తెలంగాణా జానపద గాయకుడు.చిన్నారులంతా యధాశక్తి చక్కగా పాడటానికి ప్రయత్నించారు.చిన్న లోపాలున్నా..సరిదిద్దుకోగల ప్రాయం గనుక వారి ముద్దు గారే పాటల్ని enjoy చేయడమే ముఖ్యం.

బాలు దీంట్లో చిరంజీవి గురించి మాట్లాడుతూ చెప్పింది ఒకటి నిజం.ఇప్పటికి ఎంతోమంది ఎన్నో కష్టమైన feats (?) చేసే dancers వచ్చి వుండవచ్చు.కాని చిరంజీవి dance లోని ఆ గ్రేస్ నాకు తెలిసీ ఇంతవరకు ఎవరిలోనూ లేదు.ఆ పాట యొక్క భావమే పురివిప్పి ఆడుతున్నట్టుగా వుంటుంది.

మళ్ళీ అది భానుప్రియ లో కనబడుతుంది.Dance చేసే సమయంలో ఆమె అందం  ద్విగుణీకృతమౌతుంది."కొలువై ఉన్నాడే" (స్వర్ణ కమలం) అనే పాటని ఇప్పటినేను కొన్ని వందల సార్లు చూశాను.ఇంకా చూడలానే అనిపిస్తుంది తప్ప బోరు కొట్టడం లేదు ఈనాటికి..!

సీతారామ శాస్త్రిని అవకాశం వున్నప్పుడల్లా పొగడడం బాలు బలహీనత అని చెప్పాలి.అయితే అంత గొప్పగా లేని పాటల్ని సైతం ..వాటిల్లో ఏదో బ్రహ్మపదార్థం వున్నట్టు పొగిడితేనే చిరాకు పుడుతుంది.

నా మటుకు నాకు tune  కి కరెక్ట్ గా సరిపోయే మాటల్ని ఏదో యాంత్రికంగా వేసినట్లుగా వుంటాయి ఆయన పాటల్లో చాలా..!
 గుండె కింద తడి అంటారే ...ఆ engineering of words లో అతను చాలా poor అని నా అభిప్రాయం. ఆ కళ గద్దర్ నుంచి ఆత్రేయ వరకూ అది భావజాలంతో నిమిత్తం లేకుండా కనబడుతుంది.సరే వేటూరి శిఖరప్రాయుడు..!!!

బాలన్న చివరిలో వడ్డేపల్లి తో కలిపిన గళంలో కూసంత వ్యంగ్యమే తొంగిచూసింది....!  
For more news

No comments:

Post a Comment