ఈ సారి పిల్లలంతా కొంత ఫాస్ట్ సాంగ్స్ ఎంచుకొని పాడారు.చాలావరకు బాగానే పాడారు."చెలియ..చెలియ.." అనే పాట పరమేశ్వర రావు పాడింది నాకు బాగా ఇష్టమైన సాంగ్స్ లో ఒకటి.western తరహాలో కూడా మంచి మాధుర్యం తో పాటలు చేయవచ్చునని ఇలాంటి సాంగ్స్ నిరూపిస్తాయి.హేరిస్ జయరాజ్ కి రిధం విషయం లో మంచి అవగాహన వుంది.పాట వస్తున్నప్పుడు వెనుక background లో వచ్చే రాక్ మ్యూజిక్ లో వచ్చే గిటార్ వంటిది అద్భుతంగా వుంటుంది.
అలాగే ఆ పాట లో చరణాల చివరల్లో రెండు చర్చ్ బెల్స్ సన్నగా మోగిస్తాడు.అది excellent. చర్చ్ బెల్స్ అతని చాలా పాటల్లో మంచిగా వినిపిస్తాడు.అది అతని సంతకం అని చెప్పవచ్చు. మనం అనుకుంటాం గాని ఏ వాయిద్యానికి అదే గొప్ప ఎంత కీ బోర్డ్ వచ్చినా..పలికించవలసింది వాటి అనుకరణల నే గదా..!
అసలు నన్నడిగితే ప్రతి పాఠశాలలో ఏదో ఒక వాయిద్యాన్ని నేర్చుకునే అవకాశం పిల్లలకి ఇవ్వాలి.చాలా యూరోపియన్ దేశాల్లో ఈ పద్ధతి వున్నది.అది మనిషిలోని inner nature ని ఒక కోమలత్వం తో నింపుతుంది.
మన చదువులన్నీ లేనివారికి భుక్తి కోసం,వున్నవారికి prestige కోసం సాగే చదువులాయే...!నాకు తెలిసీ బ్రిటిష్ వాళ్ళు మనదేశాన్ని పాలించేటప్పుడు కూడా ఈ పద్ధతిని పాటించేవారు.అలా నేర్చుకున్న పెద్దవాళ్ళు నాకు కొంతమంది తెలుసు.
ఇంకోటి...సింగర్స్ ని లేదా ఇతరులని ఇంటర్వ్యూ చేసినట్లుగా వాయిద్య కారులని ఎందుకు చేయకూడదు..!నిజానికి ఒక పాట అందంగా వచ్చిందంటే దానికి వెన్నెముక వాళ్ళే..! ఈ టీవి వారే దీనికి ముందు పూనుకుంటారని ఆశిద్దాము.
Click here for more
మూర్తి గారి పాడుతా తీయగా సమీక్ష లో చెప్పినట్లు ప్రతి పాటశాలలో ఏదోఒక వాయిద్యాన్ని నేర్చుకునే అవకాశం పిల్లలకు ఇవ్వాలి!
ReplyDelete