Tuesday, July 23, 2013

నిన్నటి పాడుతా తీయగా పై నాలుగు ముక్కలు!



మొదటిగా పిల్లలు ఈ మధ్య వచ్చిన పాటలని పాడారు.దాంట్లో కొన్ని ఇప్పుడే మొదటిగా వినడం.ఏవిటో..ఒకప్పుడు పాట హిట్ అయితే కొన్ని కాలాల పాటు పాడుకునేలా వుండేదది.ఇంగ్లీష్ సింగర్స్ మూలిగే మూలుగుల్ని తెలుగు వాళ్ళ ప్రేమని వ్యక్తీకరించడానికి మనం బాణీలు కట్టుకోవడం ఏమిటి..అది చాలా కృతకంగా వుంటుంది.అలాని నేను western music కి వ్యతిరేకిని కాదు. Gloria can you waddle ..అని ఒకప్పుడు బోనీఎం వాళ్ళు పాడితేనే ఆహా ఎంత మంచి పాట అనుకునేవాళ్ళం.అదే గాయకుడు వచ్చి అదే విరుపులతో తెలుగు పాట పాడితే అది ఏ పాటా కాకుండా పోతుంది.ప్రస్తుతం మన పరిస్థితి అదే..!

ఆ మధ్య ఓ మళయాళ చానల్ లో చూశాను. డోనాసమ్మర్, మైకేల్ జాక్సన్, ఆబా(గ్రూప్)  ఇంకా ఇలాంటి వాళ్ళ ఇంగ్లీష్ పాటల్ని పాడే ఓ రౌండ్ పెట్టారు.అల్లాంటిది ఏదన్నా మనాళ్ళు పెడతారేమో చూడాలి.వచ్చిన చావు ఏమిటంటే దేనిలోనూ డెప్త్ కి వెళ్ళకుండా పై హంగులతో షో చేసే గుణం మనాళ్ళలో బాగా వుంది.

సినిమా పరిశ్రమ హైదరాబాద్ వచ్చినాక ..ఏ పాట ఏమిటో,ఏ సినిమా ఏమిటో,ఏ దర్శకుడు ఎప్పుడొస్తున్నాడో..ఏ సింగర్ ఏదీ పాడుతున్నాడో  అర్ధం గాక అయోమయంగా వుంది.నిజం చెప్పాలంటే చెన్నై లోనిఒక క్వాలిటి తో కూడిన కళాపూరిత
వాతావరణం హైదరా బాదు లో వుండదు.అలాగే లేటెస్ట్ ఫేషన్ల విషయం లో చెన్నై వెనుకబడి వుంటుంది.చెన్నై లో కొన్నాళ్ళు వున్న వాడిగా నా అనుభవం ఇది.

సినిమా పాటల తరవాత ఆ పిల్లలు పాడిన లలిత గీతాలు ఎంతబాగున్నాయో..!పాలగుమ్మి గారి గురించి ఎంతచెప్పినా తక్కువే..!రేడియో లో కి వెళ్ళిపోయాము ఒక్కసారిగా..!తలనిండ పూదండ...నల్లనివాడా..కలగంటి ఇలా అన్ని గీతాలు రసగుళికలే..!
                                                 Click here for more

    

No comments:

Post a Comment