కేరళ రాష్ట్రం నుంచే ఎక్కువగా అందమైన హీరోయిన్లు రావడానికి గల కారణం ఏమిటి..? ఇప్పుడనేకాదు కె.ఆర్. విజయ ,శ్రీవిద్య వాళ్ళ కాలం నుంచి ..ఇంకా చెప్పాలంటే ముందు నుంచి కూడా కొనసాగుతోంది ఈ పరంపర.
ఒక్కరనికాదు..కొన్ని డజన్ల మందిని వుదహరించవచ్చు.శోభన,ఆసిన్,నయనతార,అమలా పాల్ ఇంకా చాలా లిస్ట్ చెప్పవచ్చు.ముఖ్యంగా వివరాల్లోకి వెళితే వీళ్ళలో చాలామంది ఆ రాష్ట్రం లోని సిరియన్ క్రైస్తవ కుటుంబాలకి చెందిన వాళ్ళు.ఇది సామాజికంగా కేరళ లో మంచి అభివృద్ది పొందిన కమ్మ్యూనిటి అని చెప్పాలి.మిగతా క్రైస్తవ వర్గాలు వున్నా తాము ఉన్నతులుగా భావించుతుంటారు.కేరళ లో 85 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలు,80 శాతం మీడియ హౌస్ లు సిరియన్ క్రైస్తవ వర్గాల చేతిలోనే వున్నాయి.రాష్ట్ర ముఖ్య మంత్రి గా కూడా ఎక్కువ శాతం వీళ్ళే వుంటారు.ప్రస్తుతం వున్న ఊమెన్ చాందీ ఆ వర్గీయుడే..!వ్యవసాయభూములు..కూడా ఎక్కువశాతం వీరి చేతిలోనే వున్నాయి.
ప్రపంచం లోని అతి ప్రాచీన క్రైస్తవ వర్గం గా వీరిని అభివర్ణించుకుంటారు. తాము నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలనుంచి convert అయినవారిగా భావించుకుంటూ ఇతర క్రైస్తవ వర్గాల వారితో ఎక్కువగా కలవరు.వీరి చర్చ్ లోని తంతులు హిందూ పూజా విధానాలకి దగ్గరగా వుంటాయి.
ధనం ప్రవహించే వృత్తులలో రాణించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.సినిమా,మోడలింగ్ ఇలాంటివి.ఎంత దూరమైనా చక్కగా వెళతారు.చుట్టు పెరిగే వాతావరణం లోనూ అలాంటి వాళ్ళు చాలా మంది వుంటారు.సినిమాల్లోకి వెళ్ళడం అంటే ఒక taboo లాగా పరిగణించడం వుండదు.ఇంగ్లీష్ మాట్లాడడం బాగా నేర్చు కుంటారు.స్వతహాగా వాళ్ళ కుటుంబాల్లో ఆ వాతావరణం వుంటుంది.
కనుక భాష సమస్య వుండదు.మనం మామూలుగా చికెన్,మటన్ ఎలా తింటామో వాళ్ళు బీఫ్ కూడా అలాగే లాగించేస్తారు.దాంట్లో స్పెషల్ వంటలు చేయడం కూడా వున్నది.మీరు ఎన్నైనా చెప్పండి...బీఫ్ తినే శరీరం మంచి రంగు తో..బలంగా పుష్టిగా వుంటుంది.అది ఆడైనా..మగైనా..!ఏ పని చేయడానికైనా రెట్టింపు వుత్సాహంతో ఉంటుంది.
మనకి అలవాటు లేదు కాబట్టి ..అమ్మో అనుకుంటాం గాని ఏది తినేవారికి అది కామన్..! Click here for more
Ommen chandy christian kadanukunta okasari confirm cheyyandi
ReplyDeleteAditya garu, Oomen Chandy is an Orthodox Syrian christian,his wife's name is Mariyamma. Oomen is a synonym for the name of Thomas (in malayali language).
Deleteతెలుగు అమ్మాయిలు కూడా ఇక బీఫ్ తినడం మొదలుపెడతారేమో అందంగా fast గా తయారై కేరళకుట్టి లతో పోటీపడి కథానాయిక పాత్రలు దక్కించుకోవడానికి!
ReplyDeleteఅంతేనంటారా..!
ReplyDeleteకేరళ, పంజాబ్ మన దేశంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు.
ReplyDeleteప్రపంచమంతా తిరిగే, వాళ్ళకు ప్రపంచ జ్ఞానం ఎక్కువ. మొహమాటాలు, పట్టింపులు తక్కువ.
సినిమాలే కాదు క్రీడల్లాంటి ఇతర రంగాల్లో కూడ వాళ్ళే ముందుంటారు.