నిన్నటి తుది ఘట్టం లోని పాటలనింటిని బాగా పాడారు పిల్లలు..!కర్నూలు లో ఆరుబయట ఈ కార్యక్రమం జరపడం బాగుంది.మంచి పాటలు ఎంచుకున్నారు.పెద్దగా న్యాయ నిర్ణేతలని తప్పుపట్టడానికి ఏమీ లేదనే చెప్పవచ్చు.పరమేశ్వర రావు కి ప్రధమ బహుమతి సమంజసమేనని అనాలి. అలాగే ద్వితీయ బహుమతి శ్రీ లలిత కివ్వడం కూడా ఓ.కె.,కాని ఉత్తమ ప్రతిభ కిచ్చిన ఆ ప్రోత్సాహకం మళ్ళీ లలితే కే కాకుండా సుదీప్ కి ఇచ్చినట్లయితే బాగుండేది.ఎనర్జీ లెవెల్స్ ఆ కుర్రాడివి అద్భుతం అని చెప్పాలి.
వీళ్ళు మళ్ళీ ఎప్పుడు ఏ మారిపోయిన రూపాలతో మనకి దర్శనమిస్తారో..ఇన్ని రోజులపాటు టి.వి.లో ప్రతి సోమవారం వీళ్ళని చూసీ..చూసీ పక్కింటి పిల్లల్లాగా అయిపోయారు.షణ్ముఖ ప్రియ పాటలతో పాటు హావభావలతోనూ గుర్తుండిపోతుంది.
కీరవాణి గారు పాడిన జాషువా పద్యాలు ఎంత భావ భరితంగా..వున్నాయో..ఇన్నాళ్ళ పాటు వినలేక పోయామే అనిపించింది.ఏదైనా ఎవరైనా పరిచయం చేస్తేనేగద తెలిసేది..! ఆయన నచ్చిన సింగర్స్ గూర్చి చెబుతూ ..ఒక అజ్ఞాత కన్నడవాసి గురించి చెప్పారు..ఆ విధంగా ఈ రోజున ఆ గాయకుడికి పాపులారిటి వచ్చినట్టేగదా..అందుకే వివేకానంద స్వామి ఒక చోట ఇలా అంటారు.."నువ్వు చేయదలుచుకున్నది అంతా చేయడానికి ప్రయత్నించు..అది సమంజసమైతే ఏ కాలంలో నైనా దానికి గుర్తింపు రావచ్చు.."!
కొన్ని ఏళ్ళ కిందట ఓ టి.వీ. కార్యక్రమంలో ఇండియన్ ఐడల్ గా సెలెక్ట్ అయిన 'కారుణ్యా ఇంటర్వ్యూ చూశాను. ఇంటర్వ్య్యూలో ఒకచోట చెబుతూ "నాకు ఇష్టమైన సింగర్స్ ఎవరని అడిగినప్పుడు కిషొర్ కుమార్ ఇంకా కొంతమంది పేర్లు చెప్పాను..ఘంటశాల అక్కడ నార్త్ లో ఎవరికీ తెలియదుగదా.. అందుకే చెప్పలేదు అని అన్నారాయన.
అవును..మన ప్రతిభామూర్తుల గురించి పరాయి వాళ్ళ ముందు ముఖ్యంగా వేరే భాషల వాళ్ళ ముందు చాటుకోవడానికి మనకి conviction వుండదు.కాబట్టి మరి ఎలా తెలుస్తారు..?
ఆ విషయం లో తమిళులు మనకి ఆదర్శప్రాయులు అని చెప్పకతప్పదు. ఎవరేమనుకున్న తిరువళ్ళువర్ గురించో,కణ్ణదాసన్ గురించో చెప్పకుండా వదలరు.రాష్ట్రపతి గా అబ్దుల్ కలాం గారు వున్నప్పుడు ఆయన ప్రతి స్పీచ్ లో ఎక్కడో ఒక చోట తిరువళ్ళువర్ ని తప్పకుండా వుదహరించేవారు.
మనకి తెలిసిందల్లా dry communal and regional feelings..!బాలు కి ఇంకా ఈటీవి వారికి జేజేలు.!
Click here for more
కారుణ్యఇండియన్ ఐడల్ గా ఎంపిక ఐనప్పుడు ఘంటసాలను తలచుకోకపోవడం తెలుగుతనం!
ReplyDelete