Thursday, August 15, 2013

జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాపై నా రివ్యూ...!



జె.కె.భారవి ఎలా తీశాడో చూద్దామని వెళ్ళాను.నిజానికి ఇలాంటి సినిమాలు తీయడం కత్తిమీద సాము లాంటిది.ఎందుకంటే శంకరుల వారి జీవిత కధ చాలామందికి తెలుసు.అనేక వాదనలు వున్నాయి వారి జీవితం మీద.తమ భావాల ద్వారాలోకాన్ని కదిలించిన మహానుభావుల..ప్రవక్తల అనుభవాలని అందరికి అర్ధం కావాలని ఏదో చేయబోతే ఇంకేదో అవుతుంది.ప్రస్తుతం ఈ సిన్మా కొంతదాకా అలాగే అనిపించింది.గ్రాఫిక్స్ అనవసరమైన చోట కూడా విపరీతంగా వాడారు. దానివల్ల చాలా సీన్లు కృత్రిమంగా వున్నాయి.కాపాలికునిగా సుమన్ ఆహార్యం...అలాగే శ్రీహరి ఆహార్యం డైలాగులు అంత అతికినట్టుగా లేవు.శ్రీ రామదాసు..అన్నమయ్య కోవలోనే కమర్షియల్ ఎలిమెంట్స్ ని వాడి సినిమాని పండించాలని చూసినట్టుగా అనిపించింది.ఎక్కడా ఒక సీను డెప్త్ లోనికి తీసుకెళ్ళదు.

మాట్లాడితే విపరీతమైన బంగారు నగలని వేసుకొని దేవుళ్ళు ప్రత్యక్షమయ్యి శంకరుని తో మాట్లాడటం ఎబ్బెట్టుగా వుంది.ఆదిశంకరుని కాలంలోని సామాజిక పరిస్థితులని చూపించడం సరిగా కుదరలేదు.అసలు కొన్ని కధలని అలా ఉంచితేనే ఒక గౌరవం.లేని పోని స్వకపోల వర్ణనలతో సొంత అజెండాలతో తీస్తే అసౌకర్యంగా  వుంటుంది.చండాలుని ఆహార్యం అప్పట్లో అలాగే వుండేదా..?విద్యలు అభ్యసించే విధానం..మరీ డ్రమటిక్ గా వుంది.నిజం చెప్పాలంటే ఇంకా మంచిగా తీయోచ్చు..ఇంకొంత మనసు పెట్టి సహజత్వానికి దగ్గరగా తీసివుంటే..!కొణ్ణాళ్ళ క్రితం సర్వదన్ బెనర్జీ హీరో గా శంకరాచార్యునిగా సిన్మా వచ్చింది.పోల్చిచూస్తే అది ప్రామాణికంగా వుంటుంది.ఇన్ని తళుకుబెళుకులు దాంట్లో లేవు గాని గుండె ని స్పృశించే రీతిలో వుంటుంది.  

నాగార్జున..చిరంజీవి సంధర్భోచితంగా చిన్న పాత్రల్లో కంపిస్తారు.కౌశిక్ బాబు  ఫర్వాలేదనిపిస్తాడు. ఎందుకో నాకు శంకరుణ్ణి ..ఆయన తత్వాన్ని జనాలకి చెబుదామన్న భావనకంటే...ఓ మంచి రస పుష్టి వున్న కధని వండి డబ్బు చేసుకుందామనే ఆలోచనే దీంట్లో కనబడింది. Click here for more   

No comments:

Post a Comment