ఈ పెద్దాయనకి 123 సంవత్సరాలు.అతి ఎక్కువ కాలం జీవించిన మనిషిగా ప్రస్తుతం రికార్డుల కెక్కాడు.దక్షిణ అమెరికా ఖండం లోని బొలీవీయా దేశానికి చెందిన ఈయన పేరు కార్మెల్ ఫ్లొరెస్ లారా..!ఫ్రాస్కీ అనే గ్రామానికి చెందిన లారా ఒక సాధారణ రైతు.అతని పుట్టిన తేది జూలై 16,1890.
కళ్ళద్దాలు ఏమీ లేకుండా చక్కగానే చూడగలడు.హాయిగా నడుస్తాడు.ఇతణ్ణి చూడటానికి వెళ్ళిన అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరిని చాలా దూరాన్నించి చూసి చేయి ఊపాడట.స్థానిక రైతులకి లానే ఎప్పుడూ కోకో ఆకులు నములుతుంటాడు.
జపాన్ కి చెందిన మిసాఒ ఒకవ 115 ఏళ్ళు,ఫ్రాన్స్ కి చెందిన జీన్ కాడ్మెంట్ 122 ఏళ్ళు జీవించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పగా ప్రస్తుతం లారా వాళ్ళ రికార్డులని అధిగమించాడు.Click here for more
No comments:
Post a Comment