Tuesday, August 20, 2013

నిన్నటి పాడుతా తీయగా పై నాలుగుముక్కలు..!




జయ జయ వినాయక ...అనే పాటతో ప్రారంభమైంది.కన్యాకుమారి లోని ఓ హో చెలి..ఓ నా చెలి అనే పాటని ఆ గాయకుడు ఫర్వాలేదనిపించాడు.నాకు బాగా ఇష్టమైన వాటిల్లో ఇది ఒకటి.ఈ రోజుకీ విని హాయిగా ఆనందించగల చక్కని పాట.సాహిత్యం కూడా ఎక్సెలెంట్ గా వుంటుంది. సుఖ దుఖాలు  ల్లోని ఇది మల్లెలవేళయని పాట పాత పాట వైభవానికి ఒక మచ్చుతునక.కిల్లర్ సినిమాలో ప్రియా ప్రియతమా విన్నాము మరొకసారి.

అందరిలోకి ఉచ్చారణ చక్కగా వుండి.. పాడిన పాట ఏదంటే "మీటి చూడు నీ హృదయాన్ని"  అనే సాంగ్.ఆ సింగర్ ని సింగర్ ఆఫ్ ది వీక్ గా చెప్పాలి.మిగతా ఇద్దరు బాగా పాడటానికి  యత్నించారు.సంగతులు ..ఉచ్చారణ..ఇలాంటి విషయాల గురించి ఆలోచించకపోవడం మంచిది.అప్పుడే ఆనందించగలం.ఎవరైనా సంగీతం తో సంబందం వున్న వారిని గెస్ట్ గా పిలిచి వుంటే బాగుండేదేమో..! Click here for more
   

2 comments:

  1. పాడుతా తీయగా కు మీ సమీక్షల ద్వారా కావ్య గౌరవం కల్పిస్తున్నారు మూర్తిగారు!అభినందనలు!

    ReplyDelete
  2. మీ ప్రశంస కి కృతజ్ఞతలు...!

    ReplyDelete