ఆసియా ఖండంలోని సింహాలు ఆఫ్రికా ఖండంలోని వాటితో పోల్చితే తక్కువ బరువు కలిగివుంటాయి.
పులికి సింహానికి దగ్గరి బంధుత్వం వుంది.
పైనున్న వాటి చర్మాలని తొలగించితే గుర్తు పట్టడం కూడా కష్టమే.
మంచిగా పెరిగిన మగసింహం యొక్క బరువు 150 నుండి 259 కేజీ ల దాకా వుంటుంది.
సింహాలు చక్కగా ఈదగలవు.
పులుల మాదిరిగా సింహాలు ఒంటరిగా ఉండవు.ఒక్కో సమూహంలో 5 నుంచి 16 దాకా కలిసి వుంటూ వేటాడుతుంటాయి.( సింహం సింగిల్ గా వస్తుందమ్మా అన్న రజనీ డైలాగ్ గుర్తుకొస్తోందా..?)
రోజులో 20 గంటలు విశ్రాంతి తీసుకుంటూ..వాతావరణం బాగుందనుకున్నప్పుడు ఓ నాలుగు గంటలు వేటాడతాయి.
సింహం యొక్క తోక కి ఉన్న కుచ్చుల పైగల భాగంలో ఉన్న నల్ల చారలని బట్టి సింహం వయసుని లెక్కిస్తారు.Click here for more
No comments:
Post a Comment