రవి వర్మ కే అందని ..అనే సుమధుర గీతం తో కార్యక్రమం మొదలైంది.ఆర్కెస్ట్రా సహకారం అద్భుతం గా వుంది.మధురమే సుధాగానం...అనే పాటని బాగానే ఆలపించారు.నిదురించే తోటలోకి..పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాటని చెప్పాలి.మామా చందమామ...పాట పాడినతని గొంతు తేలిపోయినట్టుగా వుంది.కళ్ళలో వున్నదేదో ...సాంగ్ ఎప్పటికీ నిత్యనూతనమే.చక్కని లోతుని..సరళపదాల్లో పొదగడం దాని ప్రత్యేకత. అసలు బాలచందర్ ఏ సినిమా ఇంకో సినిమాలా వుండదు. మంచి సంగీతం..సాహిత్యం రెండు మేళవించిన పాటలు ఆయన సినిమాల్లో ఎన్నో చెప్పలేము.
చిగురులు వేసిన కలలన్నీ...అనే పాట బాగా పాడాడు.ఆ పాటని ఒరిజినల్ గా పాడిన కె.బి.కె.మోహన్ రాజు స్వరం చాలా విలక్షణం గా వుంటుంది. అతనే పాడిన "సిరిమల్లె సొగసు..జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే" అనేది జ్ఞాపకం వచ్చింది.Click here for more
No comments:
Post a Comment