Tuesday, October 29, 2013

నిన్నటి పాడుతా తీయగ పై నాలుగు ముక్కలు



అదే నీవు..అదే నేను ..అనే అందమైన గీతం తో కార్యక్రమం మొదలైంది.ఆ పాటలో instrumentalisation రమ్యాతి రమ్యంగా ఉంటుంది.దానిలో పదాలు చాలా సింపుల్ గా అదే సమయం లో లోతైన భావాన్ని కలిగి ఉంటాయి.దటీజ్ ఆత్రేయ..!

హలో హల్లో...చక్కగా ప్రొఫెషనల్ సింగర్ మాదిరిగా పాడాడు.ఏదో ఒక రాగం ...ఓ.కె!జాబిలమ్మ నీకు అంత కోపమా..బావుంది.జీవితం సప్తసాగర గీతం...ఎక్స్ లెంట్.ఆ పాట జీవితం అనే పదం తో ఎత్తుకొంటున్నప్పుడు (ఒరిజినల్ లో) ఒళ్ళు ఝల్లుమంటుంది.వేటూరి విశ్వరూపాన్ని చూపించే రసగుళిక ఇది."ఖుషి ..కృషి సంగమించేచోట" అని ఆ పాటలో విన్నప్పుడు  నాకు వివేకానందుని మాటలు గుర్తుకొస్తాయి.Americans are real vedantists అంటాడాయన ఓ శతాబ్దం క్రితం.ఎక్కడో అర్మీనియా లోనో..ఏ మూలనో సర్వం కోల్పోయి బ్రతుకు ఆశ తో ఈ అమెరికా వచ్చే కాందిశీకులు మొదటిలో భయం తో బిక్కు బిక్కు మంటూ అందరికీ భయపడుతూ జీవిస్తుంటారు.అయితే కొన్ని నెలల కాలంలోనే వారు నిటారుగా ఆత్మవిశ్వాసం తో నిలబడి అమెరికా అధ్యక్షునితో కరచాలనం చేస్తూ కనిపిస్తారు.మనిషి లోని అంతర్గత శక్తులని తట్టిలేపే ఏదో మహిమ ఈ నేలలో ఉన్నది ...మన దేశం లో ఏ పనిచేయబోయినా నాలుగు మూలల నుంచి నిరాశ ని నింపే వాక్యాలే కదా...  అన్న ఆ మహనీయుని మాటలు గుర్తుకొచ్చాయి.

యమహా నగరి...మీనన్ బాగానే ప్రయత్నించాడు.ఇంకా కృషి అవసరం.జొన్నవిత్తుల మొత్తానికి మంచి వినోదాన్ని పంచారు.Click here

No comments:

Post a Comment