మధుమాస వేళ లో ...అనే మధుర గీతం తో కార్యక్రమం మొదలుపెట్టారు.మంచి ట్యూన్..చాలా నెమ్మెదిగా హాయిగా లలితంగా అందంగా ఒకింత మెలంకలీ తో సాగిపోతుందది.అల్లాంటి పాటలు సత్యం గారి స్వరకల్పన లోనే ఎక్కువగా వచ్చినవి.సొగసు చూడతరమ... బాగా ప్రయత్నించాడు.రాదే చెలి...ఓ.కె.!కదిలే మేఘమా..అనే పాట బాగుంది.సాహిత్యం లో మెరుపు ఉన్నది.ఆ గీత రచయిత వంశీ సినిమాలో కూడా పాటలు రాశారు.నాకెందుకనో అనిపించేది వేటూరి తరువాత మళ్ళీ అంతటి పద చమత్కారం ఇతనిలో కూడా ఉన్నదే అని. అయితే అకస్మాత్తుగా ఈయన మృతి వార్తని నెట్ లో ఓ చోట చదివి బాధపడ్డాను. జోహారులు శ్రీహర్ష..!
పాటల పల్లకివై...చక్కగా ఉన్నది ..!మల్లె తీగకు పందిరి వోలె..గురించి పాట గూర్చి ఎంత చెప్పినా తక్కువే.నా ఉద్దేశ్యం లో గద్దర్ తప్ప ఎవరూ అలారాయలేరు.కన్నీళ్ళని..కడగండ్లని ..తన కవిత్వం తో మమేకం చేయగలగడమే గాక జనాలని కూడా ఆ తుఫానులోకి తీసుకెళ్ళడం అది అతనికే చెల్లు..!ఆ సింగర్ కూడా బాగా పాడాడు.
చివరిగా ఆలపించిన శ్రీరామరాజ్యం లోని గీతం రమ్యాతి రమ్యం.ఆ సినిమాలో పాటలు విన్నప్పుడే అనుకున్నా జొన్నవిత్తుల లో రెండు కోణాలు ఉన్నాయని.ఒక సముద్రాల ని మళ్ళీ తలపించారు.ఆ అమ్మాయిలు బాగా పాడారు.ఆర్కెస్ట్రా చక్కగా వున్నది.Click here for more
No comments:
Post a Comment